జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనేందుకు గుజరాత్‌లోని గాంధీనగర్‌కు వెళ్లిన సీఎం చంద్రబాబును దండి కుటీర్‌ను సందర్శించాలని ప్రధాని మోదీ సూచించారు.
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన 4వ గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్‌పై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, పెట్టుబడులకు ఆహ్వానంపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకువచ్చే నూతన విధానాల గురించి పారిశ్రామిక వేత్తలకు వివరించారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు గుజరాత్ వెళ్లనున్నారు.. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో పర్యటించనున్నారు చంద్రబాబు.. గాంధీనగర్ లో నేటి నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనబోతున్నారు ఏపీ సీఎం.. రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్‌లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సదస్సులో వివరించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు..
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమికి తొలి విజయం లభించింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కేంద్రమంత్రి అమిత్ షా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్‌భాయ్‌పై 3.7లక్షల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.
గాంధీనగర్-ముంబై సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును గాంధీనగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మోడీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు.
దేశానికి ప్రధానైనా తల్లికి కొడుకే..! అందుకే ప్రభుత్వ, రాజకీయా కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడూ వీలు చేసుకొని తన తల్లిని కలుస్తుంటారు ప్రధాని మోదీ. గుజరాత్‌కు వెళ్లి ఆమెతో గడుపుతుంటారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ వందో సంవత్సరంలోకి అడుగుపెట్టారు. గుజరాత్ పర్యటనలోనే ఉన్న మోదీ.. గాంధీనగర్‌లోని తన నివాసంలో ఉన్న తల్లిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు…