కరోనా మహమ్మారి కేసులు వెలుగు చూసినప్పటి నుంచి.. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గాంధీ ఆస్పత్రిలో విశిష్ట సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి కూడా చాలా మంది కరోనా బాధితులు గాంధీ లోనే చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో… మరో అధునాతన సేవలను గాంధీ ఆస్పత్రి అందుబాటులోకి తీసుకు వచ్చింది. నేటి నుంచి గాంధీ లో జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా.. గాంధీ సూపరిండెంట్ రాజారావు మీడియాకు చెప్పారు. కరోనా…
కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. దీంతో రోగులకు చికిత్స అందించే ఆస్పత్రులు కీలకంగా మారాయి. మంచి చికిత్స పొందిన వారు కోలుకుని తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. భారత్‌లోనూ కోట్లాది మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు మాత్రం ఆస్పత్రుల్లో మంచి చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఎక్కువ మంది కరోనా రోగులకు చికిత్స పొందిన ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి మొదటి…
గాంధీ ఆసుపత్రిలో సీటీ స్కాన్ యూనిట్ ను ఇవాళ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… MRI, cathalab సెంటర్లను 45 రోజుల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా తెలంగాణలోకి రాలేదన్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన అనుమానితులకు 13 మందికి నెగటివ్ వచ్చిందని….రెండు కేసులు పెండింగ్ లో ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచుతామన్నారు. కరోనా సమయంలో…
గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్, ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెంది దాని ప్రభావాన్ని చూపుతోంది. అంతేకాకుండా ఇటీవల భారత్‌లోకి కూడా ఈ డేంజరస్ వైరస్ ప్రవేశించడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NICD) డేటా ప్రకారం.. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 మధ్య, కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌లలో 34.9 శాతం 10 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలే ఉన్నారని…
పంజాగుట్ట చిన్నారి మృతి కేసులో పోస్ట్ మార్టం నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి. చిన్నారి కడుపులో బలంగా తన్నడం వల్లే మృతిచెందిందంటున్నారు వైద్యులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులు చిన్నారి కడుపులో బలంగా తన్నినట్టు పోలీసులకు అందిన గాంధీ ఆసుపత్రి పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. ఘటన రోజు మొదట అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పోస్ట్ మార్టం నివేదిక అందడంతో హత్య కేసు గా నమోదు…
షార్ట్ సర్క్యూట్ కారణంగా గాంధీ ఆస్పత్రిలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆస్ప్రతి సిబ్బంది, రోగులు బయటకు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ) రమేష్ రెడ్డి ఆస్ప్రతిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఫైర్ సిబ్బంది 15 నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఆస్పత్రిసిబ్బంది, రోగులకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. ఆస్పత్రిలో ఉపయోగించే పరికరాలు పాడవ్వలేదన్నారు రమేష్ రెడ్డి . 120 మంది పేషంట్లను…
గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో విచారణ కొనసాగుతుంది. అయితే ఈ కేసులు మెడికల్ రిపోర్ట్ కీలకంగా మారింది. అయితే గాంధీ ఆసుపత్రి సామూహిక అత్యాచార ఘటనలో ట్విస్ట్ వచ్చింది. మెడికల్ రిపోర్ట్ నమూనాల పరీక్షల్లో మత్తు ప్రయోగం ఆనవాళ్లు లేవు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బాధితురాలు నిందితులు తనకు క్లోరోఫాం, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలు నుంచి రక్తంతో సహా వివిధ నమూనాలను సేకరించిన ఫోరెన్సిక్.. వీటి ఫలితాల్లో క్లోరోఫాం సహా…
గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటన పై సస్పెన్స్ కొనసాగుతుంది. పోలీసుల ముమ్మర దర్యాప్తు చేస్తున్న కేసు చిక్కుముడి వీడటం లేదు. గాంధీ ఆస్పత్రి నుంచి బాధిత మహిళ అక్కని సీసీ ఫుటేజ్ లో గుర్తించిన చిలకల గూడ పోలీసులు.. ఆమె ఎటువైపు వెళ్ళింది అనే దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. అయిన బాధితురాలి అక్క ఆచూకీ లభించడం లేదు. గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే సీసీ ఫుటేజ్ తో పాటు కొన్ని ఆధారాలు సేకరించింది క్లూస్ టీం & పోలీసులు.…
ఎప్పుడూ వేల మంది రోగులు, అటెండర్లతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది… బాధితురాలికి మత్తుమందు ఇచ్చి తన పశువాంఛను తీర్చుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.. అయితే, మరో బాధితురాలి ఇంకా లేకపోవడంతో ఆందోళన మొదలైంది.. అసలు గాంధీ ఆస్పత్రిలో ఏం జరిగింది.. అత్యాచార ఘటనలో బాధితురాలి ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు అనే అంశాలను పరిశీలిస్తే.. ఈ నెల 5వ తేదీన తన అక్క భర్తను గాంధీలో అడ్మిట్ చేసిన…
గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటన పై గోపాలపురం ఏసీపీ వెంకట రమణ మాట్లాడుతూ… చిలకల గూడ పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న చికిత్స కోసం మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన బాధిత మహిళ ఆమె అక్క బావ తో గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ నెల 4 నుండి గాంధీ ఆస్పత్రిలో బాధితురాలి బావ నరసింహులు అనే వ్యక్తి చికిత్స పొందుతున్నారు.…