కరోనా రోగులు ఆస్పత్రుల్లో ఉంటే.. వారికి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియక.. వారి అటెండర్లు పడిగాపులు పడాల్సిన పరిస్థితి.. కరోనా పేంషట్ల పరిస్థితి ఎలా ఉన్నా.. వారి అటెండర్ల పరిస్థితి దారుణంగా తయారైంది.. ఆహారానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొనగా.. దానికి తోడు లాక్‌డౌన్ వారి కష్టాలను రెట్టింపు చేసింది.. అయితే, ఇంత కాలం కోవిడ్ రోగులకు ఇంటి వద్దకే వెళ్లి భోజనం అందిస్తూ వస్తున్న వేదం ఫౌండేషన్.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి.. కరోనా రోగుల అటెండర్లకు కూడా ఉచితంగా భోజనం అందింస్తోంది.. ప్రస్తుతం గాంధీ, నిమ్స్, టిమ్స్, నీలోఫర్ వంటి ఆస్పత్రులు దగ్గర కోవిడ్ రోగుల అటెండర్లకు మా సేవలను విస్తరిస్తున్నామని.. ఈ ఆస్పత్రుల వెలుపల వందలాది మంది అటెండర్లు ఉన్నారు, వారు వివిధ గ్రామాల నుండి వచ్చినవారు.. వారు రోజూ పూర్తిస్థాయిలో భోజనం తినలేని పరిస్థితి.. ఇది గమనించి… మేం వేదం ఫౌండేషన్ ద్వారా ఉచితంగా భోజనం ప్యాకెట్లను అందిస్తామని తెలిపారు అలిశెట్టి అరవింద్.. అవసరం ఉన్నవాళ్లు +91 9985588821, +91 9985588831, +91 9985588841 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.