Off The Record: తానొకటి తలిస్తే… సెక్రటేరియెట్‌లోని ఉన్నతాధికారి మరొకటి తలిచాడన్నట్టుగా ఉందట చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పరిస్థితి. తాను అనుకున్నది జరిగీ జరగనట్టుగా ఉండటం ఒక ఎత్తయితే… దాన్ని బేస్ చేసుకుని ప్రత్యర్థి ఫైర్‌బ్రాండ్ లీడర్ చెలరేగిపోతుండటంతో… సార్ పరిస్థితి రోట్లో తలపెట్టి రోకటి పోటుకు వెరిస్తే ఎలాగన్నట్టు ఉందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో… నగరి చరిత్రలోనే అత్యంత ఎక్కువగా 45 వేలకు పైగా మెజార్టీతో మాజీ మంత్రి రోజా మీద…