PM Modi: 2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సంస్థలు ‘ మూడ్ ఆఫ్ ది నేషన్’ ఫలితాలను ప్రకటించాయి.
రోజు రోజుకు ఆధునిక సాంకేతికత పెరుగుతోంది. టెక్నాలజీ ఎంత కొత్తదనంతో వస్తే.. సైబర్ నేరాలు కూడా అంతే త్వరగా వస్తున్నాయి. ప్రస్తుతం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భద్రతాపరమైన ముప్పులు, సవాళ్లను ఎదుర్కొంటుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
Mehbooba Mufti: జీ 20 దేశానికి సంబంధించిన కార్యక్రమం అని.. కానీ బీజేపీ దాన్ని హైజాక్ చేసిందని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ బెంగళూర్ లో ఆరోపించారు. జీ 20ని వ్యతిరేకించడం లేదని, కానీ బీజేపీ హైజాక్ చేసిందని అన్నారు. చివరకు జీ 20 లోగోను కూడా కమలంగా మార్చిందని ఆమె విమర్శించారు. లోగో దేశానికి చెందినదిగా ఉండాలని, పార్టీకి సంబంధించిన విధంగా ఉండకూడదని ఆమె అన్నారు.
G20 Meeting: జమ్మూ కాశ్మీర్ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ కు వంత పాడుతోంది చైనా. మరోసారి భారతదేశంపై తన అక్కసును వెళ్లగక్కింది. పర్యాటక రంగంపై జీ 20 వర్కింగ్ గ్రూప్ మూడో సదస్సు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నిర్వహించాడాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. శ్రీనగర్ లో ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజలు పాటు సభ్యదేశాలతో సమావేశం జరుగనుంది.
Russia Condemns Western Blackmail: ఇండియాలో జరుగుతున్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశాలకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో పాశ్చాత్యదేశాలు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాయని, ఇందుకు జీ20 సమావేశాలను వేదికగా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని సంస్కరించడానికి ఇదే మంచి సమయం అని లావ్రోవ్ అన్నారు. వెస్ట్రన్ దేశాలు అనేక ఏళ్లుగా రష్యాపై యుద్ధానికి ప్రయత్నిస్తున్నాయని, అందుకే ఉక్రెయిన్ కు భారీగా ఆయుధాలను అందిస్తున్నాయని దుయ్యబట్టారు.
Russia Accuses West: భారత్ లో జరుగుతున్న జీ20 సమావేశాలను అస్థిర పరిచేందుకు వెస్ట్రన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయంటూ రష్యా మండిపడింది. రష్యాకు వ్యతిరేకంగా ఈ వేదికను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాయని శనివారం ఆరోపించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్, జీ7 దేశాలు రష్యా వ్యతిరేక మార్గంలో సమావేశాలను వాడుకుంటున్నాయని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ప్రధాని మోడీ దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా అత్యున్నత, అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు అని అభివర్ణిస్తూ.. ఆయన ఆధ్వర్యంలో భారత్ ప్రపంచ భవిష్యత్‌కు రక్షకుడిగా ఉద్భవించిందని బీజేపీ జాతీయ కార్యవర్గం ఆమోదించిన రాజకీయ తీర్మానం అభివర్ణించింది.
G20 Presidency to India: ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 సదస్సు రెండు రోజులుగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్ష వహించనున్నట్లు స్పష్టమైంది.