! మేనల్లుడికి మేనమామ పోలికలు వస్తే పేరు ప్రఖ్యాతులు లభిస్తాయని అంటారు. సంగీత దర్శకుడు, నటుడు జి.వి. ప్రకాశ్ కుమార్ ను చూస్తే, ఆ నానుడి నిజమే అనిపిస్తుంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ అక్క రెహనా ఏకైక కుమారుడే ప్రకాశ్ కుమార్. రెహనా కూడా గాయని. తల్లి, మేనమామ బాటలోనే ఆరంభంలో ప్రకాశ్ గళం విప్పి పాటలు పాడేవాడు. జి.వి. ప్రకాశ్ 1987 జూన్ 13న మద్రాసులో జన్మించాడు. మేనమామ స్వరకల్పన చేసిన పలు చిత్రాలలో…