తెలంగాణలో ఉత్కంఠరేపుతోన్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో కాస్త జాప్యంపై అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఓవైపు.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇంకో వైపు మండిపడుతున్నాయి.. అయితే, మరో ముందడుగు వేసిన బీజేపీ నేతలు.. ఏకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు ఫోన్ చేయడం వివాదాస్పదంగా అయ్యింది.. ఈసీకి ఫోన్ చేసి బీజేపీ నేతలు ఎందుకు ఒత్తిడి తెస్తారని అంటూనే.. ఫలితాలు త్వరితగతిన ఒత్తిడి లేకుండా విడుదల చేయాలని…
ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టానికి సంబంధించిన హామీల అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఇందుకోసం అధికారులు వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్న, ప్రతిపాదిత ప్రాంతాలకు వెళ్లడం ద్వారానే పనులు వేగం పుంజుకుంటాయని సూచించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ప్రాజెక్టుల తాజా స్థితి గురించి తెలుసుకుంటూ మార్గదర్శనం చేస్తున్న ఉపరాష్ట్రపతి గతవారం, సంస్కృతి, పర్యాటక శాఖలకు సంబంధించిన కార్యక్రమాల పురోగతి గురించి కేంద్ర సాంస్కృతి, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డితో సమీక్ష నిర్వహించిన…
Kishan Reddy: టూరిజం రంగంలో మన దేశం చాలా అభివృద్ధి చెందిందని, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి, ప్రజా రవాణాను అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తుందని కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారతదేశపు అతిపెద్ద ప్రజా రవాణా సంబంధించిన సమావేశం (ప్రవాస్ 3.0) పేరిట హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన సమావేశాన్నీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంబించారు. బస్సులు,…
ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్యా ముండా జయంతి సందర్భంగా.. ఆయన జన్మస్థలానికి వెళ్లిన కేంద్ర మంత్రలు అర్జున్ ముండా, జి. కిషన్ రెడ్డి.. బిర్సా ముండా అనుచరులను సన్మానించారు.. ఝార్ఖండ్‌లోని బిర్సా ముండా జన్మస్థలం ఖుంటి జిల్లాలోని ఉలిహటు గ్రామంలో ఈరోజు ఆయన జయంతి వేడుకలు నిర్వమించారు.. ఈ సందర్భంగా ఆయన అనుచరుల పాదాలను కడిగి.. సన్మానించారు అర్జున్ ముండా, జి కిషన్ రెడ్డి.. కాగా, 1875లో జన్మించిన బిర్సా ముండా.. 1900లో కన్నుమూశారు.. అటవీ జాతుల…
ప్రజాగాయకుడు గద్దర్ ఇవాళ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సమావేశం అయ్యారు.. దేశవ్యాప్తంగా తనపై ఉన్న కేసుల గురించి కిషన్‌రెడ్డితో చర్చించిన ఆయన.. తనపై ఉన్న కేసులు అన్నీ ఎత్తివేయాలని కోరారు.. ఇక, ఈ కేసులపై చర్చించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇప్పించాలని.. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని కోరారు గద్దర్.. కాగా, గతంలో తనపై ఉన్న కేసులను ఎత్తివేయడానికి, న్యాయసహాయం అందించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని గతంలో విజ్ఞప్తి చేశారు గద్దర్.. ప్రభుత్వం పిలుపు…
కరోనా కాలంలో పేదలను ఆదుకునేందుకు దీపావళి వరకు ఉచిత బియ్యం ఇస్తాం.. అవసరమైతే ఇంకా పొడిగిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రెండో రోజు సూర్యాపేట జిల్లాలో కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాద్ర సాగుతోంది.. సూర్యాపేటలోని కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన.. జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలుగా ఎంపికైన మెరుగు మారతమ్మ నివాసంలో అల్పాహార విందు చేశారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ…
కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు సిద్ధం అవుతున్నారు.. యాత్ర ఏర్పాట్లపై భారతీయ జనతా పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు… ఈ యాత్రకు స్వాగత కార్యక్రమాలు, చిన్న చిన్న సభలు, బైక్ ర్యాలీలు, కార్యకర్తల సమ్మేళనాలు.. నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు… తన యాత్రలో భాగంగా వనజీవి రామయ్య, చింతకింది మల్లేశంలను కలవనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఇక, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కిషన్‌రెడ్డి టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. తిరుమల శ్రీవారిని, బెజవాడ…
కర్నాటక ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయడంతో.. కొత్త సీఎం ఎంపికపై కసరత్తు ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం.. యడియూరప్ప వారసుడి ఎంపిక బాధ్యతలను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్‌రెడ్డికి అప్పగించారు.. సీఎం ఎంపిక ప్రక్రియ ఇంచార్జీలుగా ఇద్దరు కేంద్రమంత్రులను నియమించడంతో.. ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరారు.. ఇవాళ సాయంత్రం కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపనున్నారు ఇరువురు నేతలు.. సాయంత్రం 7 గంటలకు బీజేఎల్పీ సమావేశం కానుంది. ఇక, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిపై…
కేంద్ర కేబినెట్ విస్తరణలో ప్రమోషన్ అందుకున్న జి కిషన్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు.. నాపై విశ్వాసం ఉంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.. ప్రధానమంత్రి అంచనాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తానన్న ఆయన.. నాకు మార్గదర్శనం చేసి మద్దతుగా నిలిచిన అమిత్ షాకి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అమిత్ షా శిక్షణలో క్రమశిక్షణతోపాటు చాలా విషయాలు తెలుసుకున్నాను.. వారికి కృతజ్ఞుడనై ఉంటానని..బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు ఇతర…
ఇప్పటి వరకు సహాయ మంత్రిగా పనిచేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ప్రమోషన్ వచ్చింది.. ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో చోటు దక్కింది.. ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కిషన్‌రెడ్డి.. కాగా, సికింద్రాబాద్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన కిషన్ రెడ్డిని.. కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సహాయకుడిగా సహాయ మంత్రిత్వశాఖను కిషన్ రెడ్డికి అప్పగించారు. విధి నిర్వహణలో కీలకంగా వ్యవహరించి ఇద్దరి…