కేబినెట్ మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకు సహాయ మంత్రిగా పనిచేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ప్రమోషన్ వచ్చింది.. ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో చోటు దక్కింది.. ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కిషన్‌రెడ్డి.. కాగా, సికింద్రాబాద్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన కిషన్ రెడ్డిని.. కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సహాయకుడిగా సహాయ మంత్రిత్వశాఖను కిషన్ రెడ్డికి అప్పగించారు. విధి నిర్వహణలో కీలకంగా వ్యవహరించి ఇద్దరి మన్ననలను అందుకున్న ఆయనకు ఇప్పుడు కేబినెట్ హోదా దక్కింది.. ఇక, కేంద్ర కేబినెట్ మంత్రి హోదా లభించిన తొలి తెలంగాణ నేత కిషన్ రెడ్డి కావడం విశేషం.. తొలి నుంచి ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న కిషన్ రెడ్డి యువమోర్చా జాతీయ నేతగా కూడా పనిచేశారు..
కిషన్ రాజకీయ ప్రస్థానం 1977లో జనతా పార్టీలో ప్రారంభం కాగా… 1980లో బీజేపీ ఆవిర్భవించిన తర్వాత పూర్తికాలం కార్యకర్తగా పని చేశారు. 1982-83 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం కోశాధికారిగా పని చేశారు. 1983-84లో బీజేవైఎం ఏపీ కార్యదర్శిగా, 1986-90 మధ్య అధ్యక్షుడిగా.. 2004లో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదే ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి హిమాయత్ నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఆయన.. 2004-14 వరకు ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో బీజేపీఎల్పీ నేతగా పనిచేశారు.. ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించారు.
Also Read
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!