Kishan Reddy: టూరిజం రంగంలో మన దేశం చాలా అభివృద్ధి చెందిందని, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి, ప్రజా రవాణాను అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తుందని కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారతదేశపు అతిపెద్ద ప్రజా రవాణా సంబంధించిన సమావేశం (ప్రవాస్ 3.0) పేరిట హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన సమావేశాన్నీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంబించారు.
బస్సులు, కార్ ఆపరేటర్స్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియా (BOCI) నిర్వహించిన ఈ ఫ్లాగ్ షిప్ (ప్రవాస్ 3.0) సమావేశంలో ప్రయాణికులకు స్థిరమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రోత్సహించడమే లక్ష్యమని ఆయన అన్నారు. పర్యటన ఆపరేటర్లు,పర్యాటక క్యాబ్స్, తదితర రవాణా వ్యవస్థ ఒకే వేదికపైకి తీసుకురావడం వల్ల ప్రజా రవాణా అభివృద్ధికి, కొత్త ఆశయాల రూపకల్పన కొరకు సహాయపడే ఒక గొప్ప వేదిక అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టూరిజం రంగంలో భారత్ చాలా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. టూరిజంకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
read also: Chikoti Praveen: అందులో తప్పేముంది.. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తా..
చాలా రాష్ట్రాలలో కుటుంబ పాలన నడుస్తుందని అన్నారు. బీజేపీ కుటుంబ ప్రభుత్వ పాలన కాదు, బీజేపీ సిద్ధాంతం ప్రజల పాలన, అదే ప్రజలు నడిపించే పాలన అని కిషన్ రెడ్డి అన్నారు. భారత్ లోని అన్ని రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం చొరవతో అనేక జాతీయ రహదారుల నిర్మించామని తెలిపారు. రోడ్ల కనెక్టివిటీ విషయంలో భూ సేకరణలో కేంద్రం ప్రభుత్వ వాటాగా 50 శాతం ఇస్తుందని వివరించారు. బీజేపీ అధికారంలోకి రాక మునుపు భారత్ లో 64 ఎయిర్పోర్ట్ లు ఉండేవని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 54 ఎయిర్ పోర్ట్ లను స్థాపించామని గుర్తుచేసారు.
మొత్తంగా ఇప్పటివరకు భారత దేశంలో 118 ఎయిర్పోర్ట్ లు ఉన్నాయని, అందులో 21 గ్రీన్ ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయని తెలిపారు. రానున్న నాలుగేళ్లలో ఇంకా 100 ఎయిర్పోర్ట్ లు స్థాపిస్తామని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమాఖ్య సమేవేశంలో ఫ్లీట్ యజమానులు, ఆపరేటర్లతో పాటు 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, ఓఈఎమ్ లు, తదితర ప్రజా రవాణా, పర్యావరణ వ్యవస్థను ఒక్క చోటికి తీసుకురావాడంతో పాటు ఇంటర్ సిటీ ఇంట్రాసిటీ, స్కూల్ బస్సులు, ఉద్యోగుల రవాణా, పాల్గొన్నారు.
Bhatti Vikramarka: చలో రాజ్ భవన్.. కార్యకర్తలంతా మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలి..