ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువుల పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయచర్యలు చేపట్టారు. అంతేకాకుండా తక్షణ సహాయంగా రూ.1000 వెయ్యి చొప్పున సీఎం జగన్ ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం 3-4 గంటల మధ్య చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం తీరాన్ని దాటింది. భారీ వర్షాలతో కళ్యాణి జలాశయం నిండుకుండాలా మారింది. పూర్తిస్థాయి…