మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లాలో మొత్తం రూ. 396.09 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో.. రూ.353.66 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. అంతేకాకుండా.. పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైనా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ నేడు చైనాలో.. ఆ దేశ అధ్యక్షుడు చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు.
CM KCR: మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా డాక్టర్ల ముందు చేయి చూపాల్సిందే అని సీఎం కేసీఆర్ అన్నారు. నేడు నిమ్స్ కొత్త బ్లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో దసాబ్ది బ్లాక్ పేరుతో నిమ్స్ ఆస్పత్రి భవనాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు.
పాలంపేటలో ఉండే యూనేస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని కేటీఆర్ సందర్శించారు. అనంతరం రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన.. ఆలయ విశిష్టత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నాడు. అంతేకాకుండా అక్కడి నుంచి రామప్ప చెరువుకు వెళ్లి బోటింగ్ చేశారు. అనంతరం చెరువులోకి వచ్చే గోదావరి జలాలకు మంత్రి కేటీఆర్ పూజలు చేశారు. అంతేకాకుండా స్థానిక మత్స్యకారులతో కాసేపు ముచ్చటించారు.
భాగ్యనగరానికి సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ మరో మణిహారం అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక, ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ హితమైన, పర్యావరణానికి అనుకూలంగా ఉండే ప్రజా ఉపయోగకరమైన నాన్ మోటరైజ్ట్ ట్రాన్స్ పోర్టు సొల్యూషన్ను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అయితే.. దేశంలోనే ఇది మొట్టమొదటి సోలార్ రూఫ్ సైకిలింగ్ ట్రాక్ అని చెప్పారు. ఈసందర్భంగా.. స్థానికంగా ఉండే వ్యక్తులు ఆఫీస్ కు సైకిల్ పై…
అందమైన హీరోయిన్లకు, అందమైన మనసు ఉండాలనే నియమం ఏమీ లేదు! కానీ మన హీరోయిన్లు చాలామంది అందమైన మనసు ఉన్న వాళ్ళే కావడం విశేషం. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా వాళ్ళలో ఒకరు. ఇప్పటి వరకూ వ్యక్తిగతంగా తనవంతు సాయాన్ని ఆపన్నులకు అందిస్తున్న పూజా హెగ్డే ఇప్పుడు ‘ఆల్ ఎబౌట్ లవ్’ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించబోతోంది. సమాజం తనకు ఇచ్చిన దానిని తిరిగి ఇవ్వడంగానే తాను భావిస్తున్నానని పూజా హెగ్డే చెబుతోంది. ఇటీవల మీడియాతో…
మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పేదల పాలిట దైవంగా మారాడు నటుడు సోనూసూద్. అయన సేవలకు దేశం మొత్తం ప్రశంసలు కురిపించింది. సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఎక్కడ ఎవరు సాయం అంటే అక్కడ సోనూ వాలంటీర్లు వాలిపోయి సాయం చేస్తూ వస్తున్నారు. సోనూ ఫౌండేషన్ ద్వారా కష్టం అన్నవారికి సాయం చేస్తున్నాడు ఈ రియల్ హీరో. అయితే సోనూ సూద్ ఫౌండేషన్ పేరిట పలు నకిలీ లింకులు చక్కర్లు కొడుతున్నాయి. సోనూ సూద్ ఫౌండేషన్ అంటూ…