ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించిన కేసులో తెలంగాణ ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) దర్యాప్తు వేగవంతం చేసింది. సుదీర్ఘంగా 9 నెలల పాటు సాగిన విచారణ అనంతరం, ఈ కేసులో కీలక నివేదికను ఏసీబీ ప్రభుత్వానికి సమర్పించింది.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఇప్పుడు సెల్ ఫోన్ చుట్టూనే తిరుగుతుంది.. కేటీఆర్ సెల్ఫోనే ఏసీబీ అధికారులకు కీలకంగా మారింది.. సెల్ఫోను ఇచ్చేది లేదని కేటీఆర్ ఏసీబీకి కరాకండిగా తేల్చి చెప్పారు.. గతంలో వాడిన సెల్ ఫోను ఇప్పుడు తన దగ్గర లేదని, ఇప్పుడు కొత్త ఫోన్ వాడుతున్నానని చెప్పారు.. ఇందుకు సంబంధించి లిఖిత పుర్వకంగా ఏసీబీ అధికారులకు కేటీఆర్ సమాధానం పంపాడు.. అయితే సెల్ఫోన్ ఇవ్వకపోతే తదుపరి చర్యలకు తాము సిద్ధమని ఏసీబీ అధికారులు…
ఫార్ములా ఈ రేసు కేసులో గతంలో తాను వాడిన మొబైల్ ఫోన్ సమర్పించాలని ఈ నెల 16న ఏసీబీ ఇచ్చిన నోటీసుపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ లేఖ ద్వారా ఏసీబీ కి సమాధానం పంపించారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఈ నెల 13న మీరు పంపిన లేఖ మేరకు 16వ తేదీ ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయంలో స్వయంగా విచారణకు హాజరయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
Balmuri Venkat : ఫార్ములా ఈ కార్ రేసు కేసులో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే క్రమంలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ వేశారు. “చట్టంపై గౌరవం ఉందని చెబుతున్న కేటీఆర్ అదే సమయంలో విచారణను డైవర్ట్ చేయడానికి నాటకాలాడుతున్నాడు” అంటూ ఆయన విమర్శించారు. ప్రజల ఎదుట తాను నిర్దోషినంటూ సత్యహరిశ్చంద్రుడిలా నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. విచారణకు హాజరయ్యేందుకు మేం ఎవరినీ బలవంతంగా పిలవలేం కానీ, ఒక…