ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఇప్పుడు సెల్ ఫోన్ చుట్టూనే తిరుగుతుంది.. కేటీఆర్ సెల్ఫోనే ఏసీబీ అధికారులకు కీలకంగా మారింది.. సెల్ఫోను ఇచ్చేది లేదని కేటీఆర్ ఏసీబీకి కరాకండిగా తేల్చి చెప్పారు.. గతంలో వాడిన సెల్ ఫోను ఇప్పుడు తన దగ్గర లేదని, ఇప్పుడు కొత్త ఫోన్ వాడుతున్నానని చెప్పారు.. ఇందుకు సంబంధించి లిఖిత పుర్వకంగా ఏసీబీ అధికారులకు కేటీఆర్ సమాధానం పంపాడు.. అయితే సెల్ఫోన్ ఇవ్వకపోతే తదుపరి చర్యలకు తాము సిద్ధమని ఏసీబీ అధికారులు అంటున్నారు.. ఎలాంటి చర్యలు తీసుకుంటారనీ ఏసీబీ మాత్రం చెప్పడం లేదు. మరోవైపు వ్యక్తిగత గోప్యత భంగం కలిగించే విధంగా సెల్ఫోన్ అడగడం చట్ట వ్యతిరేకమని కేటీఆర్ వాదిస్తున్నాడు.. సెల్ఫోన్ సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని, దాని ప్రకారం ఎవరు కూడా వ్యక్తిగత సమాచారం సెల్ఫోన్ లాంటివి అడగవద్దని అంటున్నారు..
READ MORE: CM Revanth Reddy: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
అంతే కాదు.. అసలు తన సెల్ ఫోన్ ఏసీబీ వాళ్లకు ఎందుకు అవసరం ఉందో అనే విషయాన్ని చెప్పడం లేదని అంటున్నారు.. దానికి తోడు తన సెల్ ఫోన్‌తో వాళ్లకు ఏమీ పని అని ప్రశ్నిస్తున్నారు.. ఏది ఏమైనా తాను మాత్రం సెల్ఫోన్ ఇచ్చేది లేదని అంటూనే, మరొకవైపు ఈ ఏడాది నుంచి తాను కొత్త సెల్ ఫోన్ వాడుతున్నట్లు తెలిపారు.. 2021-2023 మధ్యకాలంలో కేటీఆర్ వాడిన సెల్ఫోన్ ఇవ్వాలని ఏసీబీ అధికారులు ఆదేశించారు.. అయితే ఆ కాలంలో వాడిన సెల్ ఫోన్ తన దగ్గర లేదని ఇప్పుడు కొత్త సెల్ ఫోన్ వాడుతున్నానని చెప్పారు.. సెల్ ఫోన్ ఇవ్వడానికి అసలు కేటీఆర్ ఎందుకు వెనుక ముందు ఆడుతున్నాడో అర్థం కావడం లేదని ఏసీబీ అధికారులు చెప్తున్నారు.. సెల్ఫోన్ ఇస్తే తమకు కావాల్సిన సమాచారాన్ని తీసుకుంటామని వాళ్లు వాదిస్తున్నారు..
READ MORE: Chittoor Crime: దారుణం.. తన కూతురుని కోడలిగా చేసుకోలేదని స్నేహితురాలి హత్య..! కులాలే కారణమా..?
సెల్ఫోన్తోనే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా జరిగాయని కాబట్టి సెల్ఫోన్ ఒక సాక్ష్యంగా తమకు ఉపయోగపడుతుందని తప్పనిసరిగా కేటీఆర్ సెల్ఫోన్ తెచ్చి ఇవ్వాల్సిందేనని acb అధికారులు వాదిస్తున్నారు.. ఈ సెల్ ఫోన్ ద్వారానే ఫార్ములా ఈ కార్ రేస్ అధికారులతో సంప్రదింపులు జరిపారని, అంతే కాకుండా డబ్బులు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ వ్యవహారం సంబంధించిందానే జరిగిందని, హెచ్ఎండిఏ అధికారులు కూడా ఈ సెల్ఫోన్ ద్వారానే ఆదేశాలు ఇచ్చారని, కాబట్టి ఈ సెల్ ఫోన్లో కొంత సమాచారం దొరుకుతుందని కావున సెల్ఫోన్ మాకు ఇవ్వాలని ఏసిబి పట్టు పడుతుంది.. కేటీఆర్ ఇచ్చిన సమాధానంతో ఏసీబీ ఏం చేయాలో ఇప్పుడు లీగల్తీవ్తో సమావేశమైంది ..లీగల్ టీం ఇచ్చే సూచన సలహాలతోటి ఏసీబీ ముందుకు వెళుతుంది.. అంతేకాదు ఎవిడెన్స్ అడిగితే ఇవ్వకపోతే దానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది .. మరోవైపు ఈ కేసులో ఏసీబీకి పూర్తిస్థాయిలో సహకరించాలని విచారణ ఎదుర్కోవాలని ఇప్పటికే హైకోర్టు చెప్పింది..
READ MORE: Kishan Reddy: రేపు ఎల్బీ స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకలు.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్రమంత్రి
కాబట్టి విచారణ సమయంలో ఏసీబీ అధికారులు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది.. అంతేకాదు వాళ్లు అడిగిన సాక్ష్యాలను కూడా అందజేయవలసి ఉంటుంది.. కానీ ఇప్పుడు కేటీఆర్ ను అడిగిన సెల్ఫోన్లు లేవని చెప్పడంతో తదుపరిగా ఏసీబీ ఏం చేస్తుందనేది అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. రెండు సార్లు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారించారు.. అయితే ఈ సమయంలో తమకు సహకరించలేదని ఏసీబీ అధికారులు కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది.. అంతేకాదు మేము అడిగిన ఎవిడెన్స్ ఇవ్వడానికి కేటీఆర్ నిరాకరిస్తున్నాడని, ఈ నేపథ్యంలో తదుపరి చర్యలకు అవకాశం ఇవ్వాలని కోర్టుని ఏసీబీ కోరే అవకాశం ఉంటది.. ఏది ఏమైనా పనికి కూడా ఇప్పుడు సెల్ ఫోన్స్ చుట్టూనే ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం నడుస్తుంది..