ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. వీళ్లు అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతుల మహాపాదయాత్రకు బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఆదివారం నాడు నెల్లూరు జిల్లాలో రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా కావలి వద్ద అమరావతి రైతుల ఆధ్వర్యంలో బీజేపీ నేతలు మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాజ్యసభ ఎంపీ…
అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు నటుడు శివాజీ సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులను కలిసి వారికి తన మద్దతును తెలియజేశారు. ఏపీ అంటేనే కులాల కుంపటి అని… ఈ కులాల కుంపట్ల మధ్య రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని శివాజీ ప్రశ్నించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలు సినిమాలో సీన్‌లను బాగానే గుర్తుపెట్టుకుంటారని.. కానీ సమాజంలో జరుగుతున్న వాటిని మాత్రం గుర్తుపెట్టుకోవడం లేదన్నారు. ప్రజలందరూ కలుషితం అయిపోయారని.. ఆ…
అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను టీడీపీ నేతలు పూర్తిగా తమ పాదయాత్రగా మార్చేసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఆరోపించారు. రైతుల పాదయాత్రను తమకు అనుకూలంగా మార్చుకుని పసుపుమయంగా చేశారని మండిపడ్డారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రలో నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతలు పాల్గొనడమే దీనికి నిదర్శనమన్నారు. పోలీసులు రైతుల పాదయాత్రను ఎక్కడా అడ్డుకోలేదని.. కేవలం టీడీపీ శ్రేణులను మాత్రమే అడ్డుకున్నారని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. Read Also: శ్రీశైలం వెళ్లే పర్యాటకులకు గమనిక.. బోట్ సర్వీస్…