Former Pakistan Prime Minister Imran Khan praises India's foreign policy: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై ప్రశంసలు కురిపించారు. తను అధికారం నుంచి దిగిపోయన తర్వాత నుంచి భారత సైన్యాన్ని, భారత ప్రభుత్వాన్ని, భారత దేశ విదేశాంగ విధానాన్ని పొగుడుతున్నారు. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం విదేశాల ఒత్తడితో పనిచేస్తుందని.. పాకిస్తాన్ కు స్వతంత్ర విదేశాంగ విధానం లేదని విమర్శిస్తున్నారు.