Alla Nani: ఏలూరులో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానితో పాటు మరికొందరిపై త్రీటౌన్ పోలీసు స్టేషన్లో ఛీటింగ్ కేసు నమోదైంది. ఇటీవల సార్వత్రిక ఎన్ని కల సమయంలో శాంతినగర్ లక్ష్మీకృష్ణ రెసిడెన్సీ అపార్టుమెంట్లో వైసీపీ నాయకుడు దిరిశాల వరప్రసాద్ తదితరులతో కలిసి శాంతినగర్ కు చెందిన అవుటుపల్లి నాగమణి ప్రచారంలో పాల్గొన్నారు.
మాజీ మంత్రి ఆళ్ల నాని.. వైసీపీకి రాజీనామా చేశారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. కొద్దిరోజుల క్రితం ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు.. నియోజకవర్గ ఇంఛార్జ్ పోస్టుకు రాజీనామా చేశారు ఆళ్ల నాని.. ఇక, ఈ రోజు వ్యక్తిగత కారణాలతో, వ్యక్తిగత బాధ్యతలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.