Congress MLA KC Veerendra Arrested: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. వీరేంద్రను శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యే వీరేంద్రను అరెస్టు చేశారు. శుక్రవారం, వీరేంద్రకు చెందిన అనేక ప్రదేశాలపై ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. దాడుల్లో రూ.12 కోట్లకు పైగా నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఒక కోటి కంటే ఎక్కువ విదేశీ కరెన్సీని సైతం స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై ఎయిర్‌పోర్డ్‌లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్ ప్రయాణీకుల వద్ద రూ.55.29 లక్షల విలువ చేసే యూఎస్ డాలర్స్, దిర్హమ్స్, దినార్స్, రియాల్స్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ వెళుతున్న ముగ్గురు ప్రయాణీకులు కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా, విదేశీ కరెన్సీని ట్రాలీ బ్యాగ్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిప్‌లో దాచి కేటుగాళ్లు తరలించేందుకు ప్రయత్నించారు. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్కానింగ్ లో విదేశీ కరెన్సీ బాగోతం బయటపడింది. దీంతో కరెన్సీ సీజ్…