నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలు, కాలనీలు నీటమునిగాయి. వరద నీటితో భగత్‌సింగ్ కాలనీ జలదిగ్బంధలో చిక్కుకుంది. వెంకటేశ్వరపురంలోని టిడ్కో గృహాలు సైతం నీటితో మునిపోయాయి. పెన్నా నది ఉగ్రరూపం దాల్చడంతో పెన్నానది పొర్లుకట్టలు కోతకు గురయ్యాయి. దీంతో బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, ఇందుకూరుపేట మండలాల్లో భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. బుచ్చిమండంలో మినగల్లు, పెనుబల్లి, కాకులపాడు, దామరమడుగు గ్రామాల్లోకి వరద నీరు వస్తోంది. వీటితో పాటు కోవూరు, ఇందుకూరుపేట, విడవటూరు…
వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోపక్క చెరువులకు గండ్లు పడుతున్నాయి. నిన్నటివరకు ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలు చిత్తూరులో కొంచెం ఆగిపోయాయి. అయితే తాజాగా ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి మళ్లీ ఎడతెరపి లేకుండా చిత్తూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అంతేకాకుండా బయటకు ఎవరూ రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో…
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరులోని 66 మండలాలో వర్షాలు కురిసాయి. 42 మండలాలో 100 మిల్లిమీటర్లు దాటిన వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా పెద్దమండ్యంలో 200 మిల్లిమీటర్లు, అత్యల్పంగా పిచ్చాటురు మండలంలో 35 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అయితే తిరుపతి అర్బన్ లో 100 మిల్లిమీటర్లు, తిరుపతి రూరల్ లో 120 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో కళ్యాణిడ్యాం నిండుకుండలా మారింది.…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి రూరల్, రామచంద్రాపురం, చంద్రగిరి,పాకాల మండలాల్లో వర్ష భీభత్సం సృష్టించింది. నక్కలేరు వాగు ప్రవాహంతో కొత్తనెన్నూరు గ్రామం ప్రమాదంలో చిక్కుకుంది. పంటపొలాలను ముంచెత్తుతూ ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామచంద్రాపురం నుంచి తిరుపతికి రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తిరుచానూరు సమీపంలోని నక్కలకాలనీ నీట మునిగింది. దీంతో షికారీలు జాతీయ…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం వాయుగుండంగా మారి చెన్నైపై తన ప్రభావాన్ని చూపెడుతోంది. ఇప్పటికీ 10 రోజుల నుంచి ఎడతెరపిలేకుండా వర్షాలు కురియడంతో తమిళనాడులోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు సీఎం ఎంకే స్టాలిన్ చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన సంప్రదించాలని సూచిస్తూ.. కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంట్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు…
దక్షిణ అండమాన్ సముదంలో అల్పపీడనం ఏర్పడడంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కోస్టల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వాతావరణ శాఖ ఆయా రాష్ట్రాలు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. రానున్న వర్షాల ప్రభావం ధాన్యం కొనుగోళ్లపై పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ధాన్యాన్ని వర్షాల నుంచి రక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. 4,039 ధాన్యం కోనుగోలు కేంద్రాలలో యుద్ధప్రతిపాదికనగా వర్షం…
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండ చైన్నైలో తీరం దాటింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను సూచించింది. తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో విమానాలను హైదరాబాద్, ముంబై, కోల్‌కత్తాలకు మళ్లిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా తమిళనాడులో 14 మంది మృతి చెందారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు…