దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో 24 గంటల వ్యవధిలో 115.5 మిల్లీమీటర్లకు మించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
తెలంగాణలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ.. breaking news, latest news, telugu news, rains, forecast
తుపాను ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గత వారం రోజులుగా నిలకడగా ఉన్న చలిగాలులు గత మూడు రోజుల నుంచి గణనీయంగా పెరగాయి. మంగళ, బుధ,గురువారాలతో పోలిస్తే శుక్రవారం ఉదయం ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.
బంగాళాఖాతంలో రుతుపవనాలు విస్తరించి ఉన్న ప్రాంతం నుంచి తమిళనాడు వరకు గాలులతో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ పలు ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. రానున్న ఐదు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే ఐదు…
అండమాన్‌తీరంలో అల్పపీడనం ఏర్పడడంతో తమిళనాడులో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే భారీ నుంచి అతిభారీ వర్షాలతో చెన్నై నగరం తడిసిముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల పాత భవనాలు దెబ్బతిని కూప్పకూలిపోతున్నాయి. విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. డిసెంబర్ 1వరకు మత్య్సకారులు వేటకు వెళ్లొదంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. సీఎం ఎంకే స్టాలిన్ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
ఏపీని వర్షాలు వదలనంటున్నాయి. మొన్నటి వరకు కురిసిన వర్షాలతోనే ఏపీలో వాగులు, వంకలు నిండి పొంగిపొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడి గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. అయితే తాజాగా అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడడంతో మరోసారి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షా పడుతోంది. అయితే వెంకటగిరి, కోవూరు నియోజకవర్గంలో రాత్రి నుంచి మోస్తరుగా, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గాలలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి.…
భారీ వర్షాలు ఏపీకి తీరని నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలతో కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోవడంతో చెయ్యేరు నదికి వరద పోటెత్తింది. దీంతో అన్నమయ్య ప్రాజెక్టు కింద ఉన్న 12 గ్రామాలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాలైతే ఇక్కడ ఊర్లు ఉండేవి అనేంతా కొట్టుకుపోయాయి. ఇళ్లు, వాకిలి, పశువులు కొట్టుకుపోవడంతో అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ వరద బీభత్సవానికి పలు గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. అయితే ఈ వరదల్లో 39 మంది…
ఏపీలో మరోసారి భారీ వర్షాలు పడతాయా? నిన్న నైరుతి బంగాళా ఖాతం , పరిసర ప్రాంతమైన ఆగ్నేయ బంగాళా ఖాతం ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు నైరుతి బంగాళా ఖాతం దక్షిణ శ్రీలంక తీరానికి దగ్గర్లో సగటు సముద్ర మట్టానికి 3 .1 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించి వుంది. పై ఉపరితల ఆవర్తనమునకు అనుభందముగా ఉపరితలద్రోణి నైరుతి బంగాళా ఖాతంనుండి ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోనైరుతి బంగాళా ఖాతంమీటర్లు ఎత్తులో విస్తరించి…
భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైంది. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులకు గండ్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల వరద బీభత్సానికి రహదారులు కొట్టుకుపోయాయి. మరి కొన్ని చోట్ల రైల్వే ట్రాక్‌లు ధ్వంసమయ్యాయి. దీంతో రైళ్లను కూడా రద్దు చేశారు. నిన్నటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నెల్లూరులోని సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరద ఉదృతి తగ్గింది. ఇన్ ఫ్లో లక్షా 93వేల 710 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో…