రేషన్ కార్డుల జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వలస కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకున్నా.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రం రేషన్ కార్డులు జారీ చేయడం లేదు. దీంతో ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రాల తీరు ఆందోళనకరమని, ఈ విషయంలో తమకు ఓపిక నశించిందని ధ్వజమెత్తింది.