నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు, అలాగే కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 170 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాటు 42 మంది గల్లంతైనట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
నేపాల్‌ను వరదలు ముంచెత్తాయి. నేపాల్‌లో ఒక నెలలోపే 47 మరణాలు నమోదయ్యాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించాయి, నేపాల్ హోం మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రాణనష్టంతో పాటు గణనీయ ఆస్తి నష్టం వాటిల్లింది.