గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. భద్రాచలం దగ్గర క్రమంగా వరద ఉధృతి పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.. దీంతో.. దిగువ ప్రాంతంలో ప్రజలు అల్లాడిపోతున్నారు.. ముఖ్యంగా పోలవరం ముంపు మండలాల్లో పరిస్థితి దయనీయంగా తయారింది.. గోదావరి ఉగ్రరూపంతో అతలాకుతలం అవుతున్నాయి పోలవరం ముంపు మండలాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు ప్రజలు.. ఇప్పటికే అనేక గ్రామాలు జల దిగ్బంధంలోకి వెళ్లిపోగా.. మరోవైపు గంట గంటకు పెరుగుతున్న నీటి మట్టం.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది..…