Hanmakonda : మొంథా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసేసింది. మరీ ముఖ్యంగా హన్మకొండ జిల్లాను నిండా ముంచింది. నగరంలో ఎటు చూసినా వరద నీళ్లే ఉన్నాయి. దాదాపు అన్ని కాలనీలు నీటిలోనే ఉన్నాయి. సమ్మయ్య నగర్ మొత్తం నీట మునిగింది. దాదాపు 4వేల ఇండ్ల దాకా నీట మునిగినట్టు అధికారులు చెబుతున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రజలంతా ఇండ్ల మీదకు ఎక్కి సాయం కోసం చూస్తున్నారు. చాలా మంది ఇండ్లను ఖాళీ…
Husnabad : మొంథా తుఫాన్ నిండా ముంచింది. రైతులకు చేతికొచ్చిన పంటను సర్వనాశనం చేసింది. ఇంకో రెండు రోజులైతే అమ్ముకుందాం.. డబ్బులొస్తాయి అని మురిసిన రైతుల నోట్లో మట్టి కొట్టింది. ఆరుగాళం కష్టపడి రక్తం దారబోసి పంట పండిస్తే.. ఒక్క గింజ కూడా మిగల్చకుండా ఊడ్చుకుపోయింది. ఎటు చూసినా రైతుల కన్నీళ్లే.. గుండెలు పిండేసే బాధలే.. ఈ హృదయవిదారకర ఘటన హుస్నాబాద్ మార్కెట్ యార్డులో కనిపించింది. భీకర వర్షానికి మార్కెట్ యార్డులోకి భారీగా వాన నీళ్లు వచ్చి…
Condom Packets: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వానలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని ప్రతి జిల్లాలో ఉన్న నదులు, రిజర్వాయర్లు, కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలో వరద మరింత బీభత్సం సృష్టించడంతో కొన్ని ఊర్ల మధ్య రాకపోక సంబంధాలు తెగిపోయాయి. అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో పంట నష్టం కూడా జరిగిందని సమాచారం. వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాలలో ప్రాణ నష్టం…
ఏపీలో వరద నష్టం అంచనాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఎన్యూమరేషన్ ఎంత మేర జరిగిందన్న అంశంపై సీఎం ఆరా తీశారు.
వరద నష్టంపై తొలిసారి భేటీకానుంది కేబినెట్ సబ్ కమిటీ... ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు భేటీకానున్నారు మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, అనగాని ప్రసాద్, వంగలపూడి అనిత. ఇప్పటి వరకు జరిగిన వరద నష్టం అంచనాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం, ఇళ్ల నష్టం అంచనాలపై చర్చించనుంది కేబినెట్ సబ్ కమిటీ..
ఆంధ్రప్రదేశ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. ఆ నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి చేరుకున్నాయి సెంట్రల్ టీమ్స్.. రాగానే మొదట.. రాష్ట్ర అధికారులతో సమావేశమై.. వరదల తీవ్రత.. నష్టంపై చర్చించారు.. దాదాపు రెండు గంటల పాటు ఏపీ అధికారులతో సమావేశమైంది కేంద్ర బృందం. ఇక, కాసేపట్లో క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లనున్నాయి కేంద్ర బృందాలు.. బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కేంద్ర బృందాల పర్యటన కొనసాగనుంది.. ఇవాళ బాపట్ల, కృష్ణా జిల్లాల్లో సెంట్రల్ టీమ్స్ పర్యటించనుండగా..…
Central Team: నేటి నుంచి వరద నష్టంపై తెలంగాణలో కేంద్ర బృందం పర్యటించబోతుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్& కమ్యూనికేషన్స్) కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం.. హైదరాబాద్ లోని సచివాలయంలో సీఎస్ శాంతికుమారితో సమావేశం కానుంది.
CM Revanth Reddy: భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను మరింత ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నేడు వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలు సృష్టించిన నష్టంపై ప్రాథమిక అంచనా వేసిన ప్రభుత్వం.. కేంద్రానికి నివేదిక పంపింది.. వరద విపత్తు వల్ల రాష్ట్రానికి రూ.6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది.. ఈ మేర కేంద్రానికి పంపేందుకు ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం..