విజయవాడలో వరదలు మిగిల్చిన నష్టంపై అంచనా వేసేందుకు సిద్ధం అవుతోంది ప్రభుత్వం.. సోమవారం నుంచి మూడు రోజుల పాటు వరద నష్టం అంచనా వేస్తామని తెలిపారు ఏపీ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్‌పీ సిసోడియా.. అయితే, ఈ సమయంలో బాధితులు ఇళ్లలో ఉంటే పూర్తిస్థాయి వివరాల నమోదుకు అవకాశం ఉంటుందన్నారు..
CM Revanth Reddy: వరద నష్టంపై సచివాలయంలో కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరిగిన వరద ప్రభావిత ప్రాంతాల దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా సీఎం, అధికారులు వివరించారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన వరద నష్టంపై ఇవాళ (శుక్రవారం) సాయంత్రంలోగా కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుడమేరు గండి పూడ్చివేతలో సైన్యం సాయం తీసుకుంటున్నామని చెప్పారు.
భారీ వర్షాలకు తెగిపోయిన చెరువుకట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. చెరువులు, కాలువల పునరుద్ధరణతో పాటు పాక్షికంగా దెబ్బతిన్న చెరువులు, కాలువల మరమ్మతులకు కూడా టెండర్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు.
Telangana Cabinet: రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నిర్ణయించింన సంగతి తెలిసిందే.