భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యల తర్వాత మాల్దీవులపై భారత్ ఆగ్రహం తగ్గుముఖం పట్టడం లేదు. సామాన్య ప్రజలతో పాటు భారతదేశంలోని ప్రముఖ ట్రావెల్ కంపెనీలు కూడా మాల్దీవులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ లోని అతిపెద్ద ట్రావెల్ కంపెనీ ఈజీ మై ట్రిప్ (EaseMyTrip) మాల్దీవులకు తన అన్ని విమాన బుకింగ్‌లను క్యాన్సిల్ చేసింది.