హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీలకు జీహెచ్‌ఎంసీ చలానాలు జారీ చేస్తోంది. కొద్దిరోజుల ముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ‘సాలు దొరా.. సెలవు దొరా’అంటూ పెట్టిన డిజిటల్ డిస్‌ప్లే బోర్డుకు రూ.50 వేలు, ప్రధాని మోదీ– బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫొటోలతో ఉన్న బ్యానర్, కటౌట్‌లకు రూ.5 వేలు కలిపి రూ.55 వేల జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లపై పౌరుల ఫిర్యాదు…
వివాహం అంటే మాములు తంతు కాదు. అతిథుల నుంచి అప్పగింతల వరకు ఎంతో తతంగం ఉంటుంది. అయితే ఇటీవల కొన్ని పెళ్లిళ్లు పీటల మీదే ఆగిపోతున్నాయి. వధూవరుల్లో కొంతమంది కుటుంబసభ్యులకు షాకులు కూడా ఇస్తున్నారు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు, అతిథులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే పెళ్లి ఆగిపోతే తమ పరువు పోయినంతగా ఫీలయిపోతుంటారు. ఈ నేపథ్యంలో ఓ పెళ్లి సందర్భంగా ఓ కుటుంబం ముందస్తు జాగ్రత్తగా ప్లాన్ Bని ముందే సెట్ చేశారు.…
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగోలేక శుక్రవారం యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఆరోగ్యానికి ఏమైందంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఓ అభిమాని వినూత్న రీతిలో కాశీలోని విశ్వేశ్వరుడికి మొక్కులు చెల్లించుకున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాయి అనే అభిమాని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శుక్రవారం సాయంత్రం దీపారాధన…
కరీంనగర్ జిల్లాలో ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. కార్పొరేషన్ అధికారులకు బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు పార్టీ శ్రేణులు. అయితే నిబంధనలకు విరుద్దంగా ఫ్లెక్సీలను కట్టారని అధికారులు తొలగించారు. దాంతో ఆ సమయంలో వారిని అడ్డుకోని వాగ్వాదానికి దిగిన బీజేపీ నాయకులు… మా ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. ఆ సమయంలో…