TDP Flag: ప్రస్తుతం ఉన్న వాతావరణ కాలుష్యం.. కల్తీ ఆహారం.. మారిన తిండి అలవాట్లతో.. మనిషి జీవన ప్రమాణ స్థాయి క్షీణించింది. అరవై ఏళ్లు బతికామంటేనే గొప్ప అనుకునే రోజులొచ్చాయంటే నమ్మశక్యం కాదు. కానీ ఓ వృద్ధుడు 80 ఏళ్ల వయసులోనూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. అక్కడ టీడీపీ జెండా ఎగరవేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గింజుపల్లి శివప్రసాద్ అనే వృద్ధుడు ఎవరెస్ట్ శిఖరాన్ని 5000 మీటర్ల ఎత్తు వరకు ఎక్కి… అక్కడ తెలుగుదేశం ఫ్లెక్సీని ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వివరాలను టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. గింజుపల్లి శివప్రసాద్ వయసు 80 ఏళ్లని తెలిపారు. ఆ వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని 5 వేల మీటర్ల ఎత్తు వరకు అధిరోహించారని, అక్కడ టీడీపీ ఫ్లెక్సీని ప్రదర్శించారని వివరించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ గారికి అభినందనలు తెలుపుతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. తాను గతంలో ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర చేపట్టానని తెలిపిన చంద్రబాబు… ఆ పాదయాత్రలో శివప్రసాద్ తనతో కలిసి అడుగులేశారని గుర్తు చేసుకున్నారు. సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించి యువతకు ఆదర్శంగా నిలిచారని శివప్రసాద్ ను కొనియాడారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా చంద్రబాబు ట్విట్టర్ లో పంచుకున్నారు.
Read Also: Uber Cab: 6కి.మీ. ప్రయాణానికి రూ.32లక్షల బిల్లు.. షాక్లో ప్రయాణికుడు
కాగా, ఆ వీడియోలో శివప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రం కష్టాల్లో ఉందని అన్నారు. విజన్ ఉన్న చంద్రబాబు వంటి సమర్థుడైన నాయకుడిని గెలిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తద్వారా యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, పరిశ్రమలు వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ఎనభై ఏళ్ళ వయసులో ఎవరెస్టు శిఖరాన్ని 5000 మీటర్ల ఎత్తు వరకు ఎక్కి… అక్కడ తెలుగుదేశం ఫ్లెక్సీని ప్రదర్శిస్తున్న గింజుపల్లి శివప్రసాద్ గారికి అభినందనలు. నేను గతంలో చేసిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో నాతో కలిసి శివ ప్రసాద్ గారు అడుగులేసారు(1/2) pic.twitter.com/vnlExtO8bw
— N Chandrababu Naidu (@ncbn) October 8, 2022