ఆఫ్రికా దేశమైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోల వరదలు బీభత్సం సృష్టించాయి. గత కొన్నిరోజులుగా కుంభవృష్టిగా కురుస్తున్న వానలతో దక్షిణ కివు ప్రావిన్స్‌లో నదులకు వరదలు పోటెత్తాయి. దీంతో బుషుషు, న్యాముకుబి వంటి గ్రామాలను నదులు ముంచెత్తాయి.
తూర్పు ఆఫ్రికా దేశమైన రువాండాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తర, పశ్చిమ రువాండాలో వరదల కారణంగా కనీసం 109 మంది మరణించారని స్థానిక అధికారుల గణాంకాలు తెలిపాయి
జమ్మూ కాశ్మీర్ అమర్ నాథ్ లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అమర్ నాథ్ పరిసరాల్లో వరదలు సంభవించాయి. అమర్ నాథ్ గుహవద్దకు వరద నీరు చేరింది. దీంతో ఇప్పటి వరకు 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికే ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ ను మొదలుపెట్టారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో అమర్ నాథ్ పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వరదలు ముంచెత్తాయి.…