ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విజయం అని ఆయన అభివర్ణించారు. దేశంలో తమ పాలనకు ప్రజలు ఇచ్చిన బహుమతి అని తెలిపారు. ఈసారి హోలీ మార్చి 10నే మొదలైందని.. ఇవాళ్టి ఫలితాల్లో గొప్ప సందేశం ఉందన్నారు. ప్రజల నమ్మకం, విశ్వాసం పొందేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేశారు కాబట్టి ఇది కార్యకర్తల విజయమని మోదీ తెలిపారు. దేశంలోని నాలుగు వైపులా ప్రజలు…
అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. దాదాపు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే ఈ ఫలితాలు ఉన్నాయి. అయితే పంజాబ్ లో ఆప్ ఊహించని మెజార్టీ సాధించింది. అధికార కాంగ్రెస్ దాదాపు తుడిచి పెట్టుకుపోవటం ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రధాన విశేషం. ఇప్పటి వరకు ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఇక దేశ వ్యాప్త విస్తరణకు ప్రయత్నిస్తుంది. ఈ విజయంతో ఆ పార్టీకి జాతీయ హోదా కూడా దక్కుతుంది. దేశంలో…
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో బీజేపీ తిరిగి విజయ పీఠాన్ని దక్కించుకుంది. అయితే బీజేపీ సాధించిన విజయంలో ఓ తెలుగు వ్యక్తి కృషి కూడా దాగి ఉంది. అతడే సత్యకుమార్. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి నేతగా మారి ప్రస్తుతం యూపీ బీజేపీ ఇంఛార్జిగా ఆయన సేవలందిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి తనదైన ప్రచార వ్యూహ రచనతో యూపీలోని 403 స్థానాల్లో 135 స్థానాలకు సత్యకుమార్ చేసిన కృషి అనితర సాధ్యమని రాజకీయ విశ్లేషకులు…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఎఫెక్ట్ చమురు ధరలపై పడింది. ఈ ప్రభావం ఇండియా మీద కూడా పడబోతోంది. ఈనెల 7న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. అనంతరం ఈనెల 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈనెల 10 తర్వాత ఏ క్షణమైనా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్ల సవరణను చేపట్టవచ్చని జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేసింది. లీటర్ పెట్రోల్ రూ.10-15 లోపు, లీటర్ డీజిల్ రూ.8-10 వరకు పెరిగే అవకాశాలు…
దేశంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలను సడలించింది. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బహిరంగ సభలు, ఇండోర్ సమావేశాలు, ఇంటింటి ప్రచారాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్, వాహనాల ర్యాలీలు, ఊరేగింపులపై గతంలో విధించిన నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. Read Also: భారత్‌లో మరో కొత్త కల్చర్… ఇకపై వారానికొకసారి ఎన్నికల ప్రచారంలో…
ప్రస్తుతం జరగోబోతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఎన్టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న 4 రాష్ట్రాల్లో యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో తిరిగి అధికారం బీజేపీదేనని స్పష్టం చేశారు. పంజాబ్‌లో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జీవీఎల్ అన్నారు. బీజేపీ కూటమికి ప్రజలు పంజాబ్‌లో అధికారం అప్పగిస్తారనే ఆశాభావంతో ఉన్నామన్నారు. ఏదిఏమైనా, పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర…
త్వరలో దేశంలోని పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఒకపక్క కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీ సహా అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలలో ర్యాలీలు, రోడ్ షోలపై ఎన్నికల కమిషన్ నిషేధం పొడిగించింది. గతంలో ఈనెల 15 వరకు నిషేధం విధించగా.. తాజాగా ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధాన్ని ఈనెల 22 వరకు పొడిగిస్తున్నట్లు శనివారం నాటి…
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది… ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించిన ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసినట్టు మీడియాకు సమాచారం ఇచ్చింది సీఈసీ.. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం మే నెలలో ముగియనుండగా.. మిగతా నాలుగు అసెంబ్లీల గడువు మార్చిలోనే వేర్వేరు…