టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను మొదలు పెట్టిన సుహాస్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ‘కలర్ ఫొటో’ మరియు ‘రైటర్ పద్మభూషణ్’ వంటి చిత్రాలతో మంచి విజయం సాధించాడు.మరోవైపు నెగిటివ్ రోల్స్ లో కూడా నటిస్తూ మెప్పిస్తున్నాడు.గత ఏడాది వచ్చిన హిట్: ది సెకండ్ కేసులో సైకో కిల్లర్ పాత్రలో కనిపించి షాకిచ్చాడు.సుహాస్ మరోవైపు హీరోలకు స్నేహితుడిగాను అలరిస్తున్నాడు. తాజాగా సుహాస్ హీరోగా నటించిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’.దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో…