టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను మొదలు పెట్టిన సుహాస్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ‘కలర్ ఫొటో’ మరియు ‘రైటర్ పద్మభూషణ్’ వంటి చిత్రాలతో మంచి విజయం సాధించాడు.మరోవైపు నెగిటివ్ రోల్స్ లో కూడా నటిస్తూ మెప్పిస్తున్నాడు.గత ఏడాది వచ్చిన హిట్: ది సెకండ్ కేసులో సైకో కిల్లర్ పాత్రలో కనిపించి షాకిచ్చాడు.సుహాస్ మరోవైపు హీరోలకు స్నేహితుడిగాను అలరిస్తున్నాడు. తాజాగా సుహాస్ హీరోగా నటించిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’.దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివాని నాగరం హీరోయిన్ గా నటించింది.శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న మరియు ‘పుష్ప’ ఫేమ్ జగదీశ్ ప్రతాప్ బండారి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.
జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ అయిన మోషన్ పిక్చర్స్ మరియు ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ టీజర్ మరియు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ గా రిలీజ్ చేశారు. దాంతో ఈ మూవీ విడుదలైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రీమియర్ షోలతో క్రిటిక్స్ నుంచి ప్రశంసలు వచ్చాయి. దాంతో ఈ మూవీ తొలి రోజు భారీ ఒపెనింగ్ ఇచ్చింది. ఫస్ట్ డే కలెక్షన్స్ చూసి మేకర్సే సర్ప్రైజ్ అవుతున్నారు.ఈ మూవీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 2.28 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. తాజాగా దీనిపై మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. ఒక చిన్న హీరో సినిమా ఫస్ట్ డే ఈ రేంజ్లో వసూళ్లు రాబట్టడమంటే సాధారణ విషయం కాదు. రెండవ రోజు కూడా ఈ మూవీ అదే జోరుతో కొనసాగుతుందని విశ్లేషకులు తెలుపుతున్నారు.
https://twitter.com/ActorSuhas/status/1753724774881325410?