ప్రో కబడ్డీ సీజన్ 11 ఈరోజు ప్రారంభమైంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రో కబడ్డీ పోటీలు మొదలయ్యాయి. అయితే.. తొలి మ్యాచ్ బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ మధ్య పోరు జరిగింది. ఈ పోరులో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. 37-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దీంతో.. మొదటి మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది.
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఉమెన్స్ జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. భారత్ ముందు 161 పరుగుల బిగ్ టార్గెట్ పెట్టింది.
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. న్యూజిలాండ్తో మొదటి మ్యాచ్ ఆడనుంది. న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. భారత జట్టు ముందుగా బౌలింగ్ చేయనుంది.
దులీప్ ట్రోఫీలో యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో ముషీర్ ఖాన్ సెంచరీతో అదరగొట్టగా, ఇప్పుడు బౌలింగ్ విభాగంలో ఆకాశ్ దీప్ చెలరేగాడు. తొలి మ్యాచ్‌లోనే ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇండియా బితో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు.
ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్ లాంటిది. ఐపీఎల్ 17వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 22న హోమ్ గ్రౌండ్ ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో చెన్నై తలపడనుంది. మొత్తం.. 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. సాధారణంగా డిఫెండింగ్ చాంపియన్- రన్నరప్ మధ్య మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్ కొత్త ఎడిషన్ ఆరంభించడం…
ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రపంచకప్ 2023లో ఈరోజు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్తోనే ఎంట్రీ ఇచ్చాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ సాధించాడు. ట్రావిస్ కేవలం 59 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. అంతేకాకుండా అతని దూకుడు ఇన్నింగ్స్ తో తన పేరును ప్రత్యేక జాబితాలో నమోదు చేసుకున్నాడు.
వరల్డ్‌కప్ 2023లో మహమ్మద్ షమీ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన తొలి ఓవర్ మొదటి బంతికే వికెట్ తీశాడు. కివీస్ ఓపెనర్ విల్ యంగ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.