విమాన ప్రయాణం అంటే సహజంగా భాగ్యవంతులు ప్రయాణం చేస్తుంటారు. ఎందుకంటే ఖరీదైన టికెట్లు కొనుగోలు చేసి సామాన్యులు ప్రయాణం చేయలేరు. ఎక్కువగా డబ్బు ఉన్నవాళ్లు.. లేదంటే వీఐపీలు జర్నీ చేస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.
రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభమైంది. న్యూఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంది మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్.. తొలి విమాన సర్వీసులో ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి వచ్చారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.. ఇక, రన్ వే పై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్ కు వాటర్ కెనాల్స్…