అసలే కరోనా సమయం.. బతకడమే కష్టంగా మారింది.. ఎన్నో ఉద్యోగాలు ఊడిపోయాయి.. ఉపాధిపై కరోనా ఘోరంగా దెబ్బకొట్టింది. ఈ సమయంలో.. ఈఎంఐలు కట్టడం కష్టంగా మారిన పరిస్థితి.. కానీ, ఓ ఆటో డ్రైవర్‌కు ఫైనాన్స్ కంపెనీల వేధింపులు ఎక్కువయ్యాయి.. మరోవైపు పోలీసుల వేధింపులు పెరిగాయని.. పెట్రో ధర భారం కూడా పడిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్.. తాను ఫైనాన్స్‌లో తీసుకున్న ఆటోపై పెట్రోల్ పోసి నిప్పటించాడు.. ఈ ఘటన హన్మకొండలోని కాళోజీ జంక్షన్ లో…
హైదరాబాద్ : రాజేంద్రనగర్ లోని కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ పరుపుల గోదాంలో మంటలు చెలరేగాయ్. ఐతే…మంటలను గమనించిన కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీశారు. క్షణాల్లో పరిశ్రమ అంతటా మంటలు వ్యాపించాయి. పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది…మంటలను అదుపు చేస్తున్నారు. గోదాంలోంచి కార్మికులు బయటకు రావటంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై క్లారిటీ…
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గ్యాస్ పైప్‌లైన్ లీకై మంటలు చెలరేగిన ఘటన కలకలం సృష్టించింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అవనిగడ్డలో ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి వేసిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయ్యింది.. దీంతో.. అవనిగడ్డలోని సీతాయమ్మ హోటల్ సెంటర్ వద్ద భూమిపై మంటలు చెలరేగాయి… వెంటనే స్పందించిన గ్యాస్ సిబ్బంది.. పైప్ లైన్ రిపేర్ వర్క్ ప్రారంభించారు. ఒక్కసారిగా భూమిపై మంటలు రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ మంటల వలన…
హైదరాబాదులో ఓ పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో మంటలు ఎగిసిపడటంతో దగ్ధమైపోయింది. ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు, మంటలు చెలరేగడంతో వాహనంలో ఉన్నవారు వెంటనే అప్రమత్తమయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన వచ్చి మంటలు ఆర్పేశారు. ఈ ఘటనతో ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. టాటా సుమో ఇంజిన్ లో సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
హైదరాబాద్ లో తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆబిడ్స్ లోని గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐ కార్యాలయం ఆవరణలో బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సర్దార్‌ఖాన్, కాంట్రాక్టు ఉద్యోగి సురేందర్ పై కాల్పులు జరిపాడు. దీంతో సురేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది గాయపడిన ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి మధ్య పరస్పర వాగ్వాదంతో విచక్షణ కోల్పోయిన సెక్యూరిటీ గార్డు సర్దార్ ఖాన్ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. సురేందర్ ప్రస్తుతం హైదర్‌గూడలోని…
హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే 202 పిల్లర్ వద్ద నడుస్తున్న బీఎండబ్ల్యూ కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భయపడ్డ స్థానికులు దూరంగా పరుగెత్తారు. కారు ఇంజిన్ భాగంలో పొగలతో కూడిన మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ పక్కకు నిలిపివేశాడు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు త్వరగా దిగేయడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. పక్కనే వున్నా పెట్రోల్ బంక్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ సహాయంతో మంటలను…
చుట్టూ ఎక్కడ చూసిన తీరం కనిపించనంత విశాలంగా విస్తరించిన సముద్రం. నట్ట నడిమిలో ఎగసిపడుతున్న మంటలు . చూడటానికి ఆ దృశ్యం ఎంత అందంగా ఉందో .. అంతే భయంకరంగా కూడా ఉంది . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోలోని యూకాటన్ ద్వీపకల్పంలో పెమెక్స్ అనే చమురు సంస్థ ఉంది. ఆ కంపెనీ రోజు వారీగా దాదాపు 1.7 మిలియన్ బారెల్స్ చమురు ను ఉత్పత్తి చేస్తోంది.…
కడప జిల్లా పులివెందుల మండలంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లెకు చెందిన పార్థసారథి రెడ్డిపై పులివెందుల ఎంపీపీ శివప్రసాద్ రెడ్డి కాల్పులు జరిపారు. కాల్పుల్లో పార్థసారథిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. పార్థసారథి రెడ్డి మరణించాడనే భయంతో ఆత్మహత్య చేసుకుని ఎంపీపీ శివ ప్రసాద్ మరణించారు.అయితే ఈ ఘటనకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది. ఆస్తి తగాదాలే ఈ ఘటనకు కారణమని.. వాళ్ళు ఇద్దరు బంధువులే అని స్థానికులు అంటున్నారు. కాగా విషయం తెలిసిన…
హెచ్ పీసీఎల్ రిఫైనరీలో అగ్ని ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణం అని కలెక్టర్ కు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది టెక్నీకల్ కమిటీ. ప్రమాదానికి కారణాలు తెలిపింది. బిటుమిన్ ను తీసుకు వెళ్తున్న 6 ఇంచ్ ల పైపులైను కు 2.5 అంగుళాల నుండి 3 అంగుళాల రంధ్రము ఏర్పడింది. 355 నుండి 400 ఉష్ణోగ్రతల బిటుమిన్ లీకవ్వడంతో మంటలు చెలరేగాయి. 30 మీటర్ల ఎత్తులో ఉన్న పైపు లైన్లు 6 చోట్ల దెబ్బతిన్నాయి. బిటుమిన్ కు హైడ్రోకార్బన్లు…
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆ రాష్ట్రంలోని పూణెలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దూరదృష్టవశాత్తు 15 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో ఆ కెమికల్ ఫ్యాక్టరీలో 37 మంది కార్మికులు ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ ఘటన సమాచారం తెలియగానే.. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటల నుంచి 20 మందిని కాపాడింది. మరో ఇద్దరు కార్మికులు మంటల్లోనే చిక్కుకోవడం బాధకరమైన విషయం. ప్రస్తుతం మంటలు ఆర్పే…