West Bengal: కోల్‌కతా నగరంలో మరో అగ్నిప్రమాదం జరిగింది. రూబీ సమీపంలోని ఓ షాపింగ్ మాల్‌లో శుక్రవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. నాలుగు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
దేశరాజధాని ఢిల్లీ ఉలిక్కిపడింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 27 మంది సజీవ దహనమయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందంటున్నారు. పశ్చిమ ఢిల్లీలోని ముంద్రా మెట్రో స్టేషన్ 544 పిల్లర్ వద్దనున్న నాలుగంతస్తుల వాణిజ్యం భవనంలో నిన్న సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న సీసీ టీవీ కెమెరా, రూటర్ తయారీ కంపెనీ…
హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోట్లలో ఆస్తి నష్టం కలిగింది. రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్ ప్రింటింగ్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న అగ్ని కీలకలు ఎగిసిపడుతున్నాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుంది. మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. పరిశ్రమలో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామికవాడలో ఓ ప్లాస్టిక్ ప్రింటింగ్ పరిశ్రలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.…
కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. యూనివర్సిటీ ఆవరణలోని చెట్లు పొదల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు అప్రమత్తమై ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నించారు. ప్రమాదం కారణంగా యూనివర్శిటీలో పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి మంటలు. బాయ్స్ హాస్టల్ సమీపం నుంచి ఎంబీఏ కాలేజీ ఆవరణం వరకూ విస్తరించాయి మంటలు. శాతవాహన యూనివర్సిటీ లో ఉన్న…
ప్రపంచవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు భారీ నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. చైనాలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భూగర్భ ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈశాన్య చైనాలోని డాలియన్ సిటీలోని మార్కెట్ దిగువన ఉన్న అండర్ గ్రౌండ్‌లో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరగవచ్చని అంటున్నారు. గాయపడ్డ కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి…