ఈమధ్యకాలంలో అగ్నిప్రమాదాలు మామూలైపోయాయి. ఈ ప్రమాదాల కారణంగా భారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం కలుగుతోంది. చిత్తూరు మోర్ధానపల్లి అమరరాజా గ్రోత్ కారిడార్ లో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ట్యూబులర్ బ్యాటరీ తయారీ విభాగంలో మంటలు చెలరేగి ప్లాంట్ మొత్తం వ్యాపించాయి. సంఘటనా స్దలానికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలతో అర్ధరాత్రి వరకు అతి కష్టం మీద మంటలు అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది.
Read Also: Teachers Transfer : టీచర్ల బదిలీలకు దరఖాస్తు గడువు పొడగింపు
మంటలు రాత్రి భోజన విరామంలో జరిగాయి. ఆ సమయంలో సిబ్బంది అంతా క్యాంటీన్ లో ఉండటం తో సిబ్బందికి ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలిసు అధికారులు, అగ్నిమాపక అధికారులు విచారణ జరుపుతున్నారు. అగ్నిప్రమాదంలో వల్ల ఏర్పడ్డ ఆస్తి నష్టం పై అంచనా వేస్తున్నారు అమర రాజా సంస్ద అధికారులు. ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: Bhakthi Tv Tuesday Magha Masam Live: మాఘమాసంలో మంగళవారం ఈ స్తోత్రం వింటే..