Renigunta Fire Accident: ఆస్పత్రిలో మంటలు.. డాక్టర్ సజీవ దహనం, ఇద్దరు పిల్లలు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి జిల్లా రేణిగుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆ అగ్నిప్రమాదం ఓ వైద్యుడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆస్పత్రి పై పోర్షన్ లో వుంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంలో వైద్యుడితో పాటు ఆయన కుమార్తె, కుమారులు మృతిచెందారు. వైద్యుడు ఘటనాస్థలంలోనే సజీవ దహనం కాగా.. ఆయన పిల్లలిద్దరూ చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో ఆప్రాంతంలో విషాదం నెలకొంది. ఆస్పత్రిలో మరికొందరు చిక్కుకుని పోయారని తెలుస్తోంది. రెస్క్యూ టీం ఇద్దరిని కాపాడింది.
Read Also: Breaking: రేణిగుంట ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
Also Read
రేణిగుంట పట్టణం భగత్‌సింగ్ కాలనీలో డాక్టర్ రవిశంకర్‌రెడ్డి కార్తికేయ పేరుతో ఆస్పత్రి పెట్టారు. ఆయన కుటుంబం ఆస్పత్రి నిర్వహిస్తున్న భవనంలోనే పైఅంతస్తులో వుంటోంది. ఆదివారం ఉదయం వైద్యుడి కుటుంబం నివాసముంటున్న అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న తిరుపతి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు గమనించి వెంటనే రవిశంకర్‌రెడ్డి భార్య, అత్తను కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది అతికష్టం వైద్యుడి కుమారుడు భరత్ (12) కుమార్తె కార్తీక (15)లను పైఅంతస్తు నుంచి కిందికి దించారు.
అయితే ఆ పిల్లలిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారులు కూడా మృతిచెందారు. షార్ట్‌సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Read Also: Jobs Fraud in Cambodia : కాంబోడియాలో ఉద్యోగాలంటూ ఎర.. తిరుపతివాసికి నరకయాతన
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..