టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో టీఆర్ఎస్ నేతలు పలుచోట్ల భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ప్రధాన రహదారులపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని గతంలో జీహెచ్‌ఎంసీ అధికారులు నిబంధనలు విధించారు. దీంతో ఏ పార్టీ నేతలు ఫ్లెక్సీలు పెట్టినా ఊరుకోవడం లేదు. తాజాగా అధికార పార్టీ నేతలే భారీగా ఫ్లెక్సీలు పెట్టడంతో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి టీఆర్ఎస్ నేతలకు జరిమానాలు విధించారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శికి రూ.65వేలు, మంత్రి…
హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైనే వాహనాలను పార్క్ చేస్తుంటారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చాలా కాలంగా రోడ్లపై వదిలివెళ్లిన వాహనాలను పోలీసులు క్రేన్‌ల సహాయంతో తొలగిస్తున్నారు. ఆయా వాహనాలను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలను వదిలివెళ్లే వారికి ట్రాఫిక్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. 15 రోజులు కారు రోడ్డుపై కనిపిస్తే సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా రోడ్లపై వాహనాలు వదిలి వెళ్లేవారికి భారీగా జరిమానా…
కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని భావిస్తూ చాలా చోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. థర్డ్ వేవ్ ముప్పు మొదలైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను కేంద్రం ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందేనని అధికారులు మరోసారి గుర్తుచేస్తున్నారు. అయితే తాజాగా మంచిర్యాల జిల్లాలో.. థర్డ్ వేవ్ దృష్ట్యా డీసీపీ రోడ్డుపై నడుచుకుంటూ ఆ ప్రాంతాల్లో మాస్క్ ధరించని వారిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ..…