బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఐదు గంటలపాటు సుధీర్గంగా ప్రకాశ్‌రాజ్ స్టేట్ మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం వ్యవహారంలో నిర్వాహకులు నుంచి తనకు డబ్బులు అందలేదని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు.. ఇకనుంచి బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేయనని తెలిపారు..
వృద్ధుడికి మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు సైబరాబాద్ పోలీసులకు చిక్కారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వృద్ధుడి నుంచి రూ. 74.36 లక్షలు కాజేశారు. బాధితుడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతని నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్నారు. నకిలీ ట్రేడింగ్ యాప్ లింకులు పంపి పెట్టుబడి పెట్టమని చెప్పి భారీగా మోసానికి పాల్పడ్డారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి (పీఎన్‌బీ) వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని.. ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ బెల్జియంలో అరెస్టయ్యాడు. ఏడాది కిందటే ఆ దేశానికి వచ్చిన అతడిని తమకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన అభ్యర్థన కారణంగానే అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈయన మాదిరిగానే మరి కొందరు కూడా బ్యాంకులను మోసం చేసిన విదేశాలకు పారిపోయారు. వారి గురించి ఒక్కొక్కరిగా…
Blackmailer: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా.. మరోవైపు అదే టెక్నాలజీ ఉపయోగించి అనేక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల వల్ల అనేకమంది అమాయక ప్రజలు ఇబ్బందులు పడి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మరికొందరు వారి బాధను భరించలేక చివరికి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా చాలా ఉన్నాయి. ఇకపోతే, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని విప్రో సంస్థలో పనిచేసిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఓ బ్లాక్ మైలర్ బెదిరించి ఏకంగా…