బీజేపీ-శివసేన కూటమితో ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇక, అజిత్ పవార్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు.. తాను కోరుకున్న ఆర్థిక శాఖను ఆయన దక్కించుకున్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు నేడు కొత్త శాఖలు కేటాయించారు. ఈ కేటాయింపుల్లో అజిత్ వర్గానికి మంచి ప్రాధాన్యత ఉన్న శాఖలే వచ్చాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు అతిషికి ఢిల్లీ మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళిక, ఆదాయానికి సంబంధించిన అదనపు బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు విభాగాలు గతంలో కైలాష్ గెహ్లాట్ వద్ద ఉండేవి.
వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించిన దేశ బడ్జెట్‌ను మరికొన్ని రోజుల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న వేళ ఆర్థిక మంత్రిత్వ శాఖలో గూఢచర్యం ఘటన కలకలం రేపుతోంది.
అవసరం కోసం అప్పులు చేయడం సహజం. కానీ ఆ అప్పులే ముప్పుగా పరిణమిస్తే విధిలేని పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫైనాన్సర్ల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఫైనాన్సర్ల వేధింపులు తట్టుకోలేక సాయి కృష్ణ(26) అనే యువకుడు మృతి చెందాడు. కరోనా కాలంలో చెల్లించవలసిన ఫైన్…
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో గంటసేపు సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్ సమస్యలను ప్రధానికి నివేదించారు. ఈమేరకు విజ్ఞాపన పత్రం కూడా అందించారు సీఎం జగన్. రాష్ట్ర విభజన పర్యవసానాలు ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బ తీశాయన్నారు సీఎం. రాష్ట్ర విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి రాగా, కేవలం 45 శాతం రెవిన్యూ మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ…