ఏపీ ప్రభుత్వం మరోసారి రుణం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ విడత రూ.1,000 కోట్లు రుణం తీసుకోవాలని భావిస్తోంది. 13వ తేదీన ఆర్ బీఐ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొననుంది సర్కారు. ఈవిషయంపై ఆర్ బీఐకి సమాచారం కూడా ఇచ్చిందని తెలుస్తోంది. వివిధ సంక్షేమ పథకాలకు డబ్బులు కోసం ఏపీ ప్రభుత్వం చేయని ప్రయత్నాలు లేవు. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లోనే సర్కారు భారీగా రుణాలను సమీకరించింది ప్రభుత్వం.
మరో విడత రూ.1,000 కోట్ల కోసం ఈ నెల 13న ఆర్ బీఐ నిర్వహించే వేలంలో పాల్గొంటామంటూ అధికారికంగా సమాచారం ఇచ్చింది.ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో అంటే ఆగస్ట్ నాటికి రూ.48వేల కోట్లకు పైగా రుణాలు సమీకరించింది. ఆర్ బీఐ వేలంలో పాల్గొని రూ.1,000 కోట్ల రుణం పొందితే, అది రూ.49,100 కోట్లకు చేరుతుంది. ఇక ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్ల రూపంలో తీసుకున్న రుణాలు వీటికి అదనం.
ఇదిలా వుంటే.. మరికొన్ని సంక్షేమపథకాలకు జగన్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అక్టోబరు 1 నుంచి వైయస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు జీవో కూడా జారీ అయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు వర్తించనుంది. పేద ఆడపిల్ల కుటుంబాలకు సర్కారు బాసటగా నిలవనుంది. వివాహం జరిపించేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది. ఎస్సీలకు వైయస్సార్ కళ్యాణమస్తు కింద రూ. 1లక్ష రూపాయలు అందించనుంది.
Read Also: Danam Nagender: సీఎం కేసీఆర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే నందుబిలాల్ నిరసన చేయడం తప్పా?
ఎస్సీల కులాంత వివాహాలకు రూ. 1.2 లక్షలు,ఎస్టీలకు రూ. 1 లక్ష అందించనుంది. ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు ఇవ్వనుంంది. బీసీలకు రూ. 50వేలు, బీసీలు– కులాంత వివాహాలకు రూ.75వేలు ఇవ్వనుంంది. మైనార్టీలకు రూ. 1 లక్ష, వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు, భవన నిర్మాణకార్మికులకు రూ.40వేలు జగన్ ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం ద్వారా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేశామంటున్నారు జగన్. ఈ పథకానికి సంబంధించి పూర్తిగా వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి వచ్చాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పథకం నిర్వహించనున్నారు. ఈ పథకానికి కూడా భారీగా నిధులు కావాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం 1000కోట్ల నిధులకు ప్రయత్నాలు చేస్తోంది.
Read Also: Danam Nagender: మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల గురించి అస్సాం సీఎంకు ఏం తెలుసు..!