బీజేపీ-శివసేన కూటమితో ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇక, అజిత్ పవార్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు.. తాను కోరుకున్న ఆర్థిక శాఖను ఆయన దక్కించుకున్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు నేడు కొత్త శాఖలు కేటాయించారు. ఈ కేటాయింపుల్లో అజిత్ వర్గానికి మంచి ప్రాధాన్యత ఉన్న శాఖలే వచ్చాయి. అయితే తనకు ఆర్థిక శాఖ కావాలని అజిత్ పవార్ పట్టుబట్టారు. ఇది డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర ఉంది.
Read Also: Shani Trayodashi: శని త్రయోదశి.. హైదరాబాద్‌లోని ఈ ఆలయంలో అభిషేకం చేయాల్సిందే..
అయితే తనకు అదే శాఖ కావాలని అజిత్ పవార్ పట్టుబట్టి మరి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. క్యాబినెట్‌లో కీలకమైన ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖను అజిత్‌కు కేటాయించారు. వెంటనే ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. కాగా, తాజాగా శాఖల కేటాయింపుల్లో, ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్‌కు పౌర సరఫరాల శాఖ, అనిల్ పటేల్‌కు రిలీఫ్ అండ్ రిహాబిలేషన్, డిజాస్టర్ మేనేజిమెంట్ శాఖ, అదితి సునీల్ టట్కరేకు మహిళ, శిశు అభివృద్ధి శాఖ కేటాయించగా, ధనంజయ్ ముడేకు వ్యవసాయం, దిలీప్ వాల్సే పాటిల్‌కు రెవెన్యూ, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి శాఖ కేటాయించారు.
Read Also: IAS Officers Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. బీజేపీ, శివసేనతో సహా మంత్రి పదవులు తీసుకుని, కొన్ని కీలక శాఖలను అజిత్ పవార్ తీసుకున్నారు. దీంతో ప్రభుత్వంలో ఆయన వర్గం కీలకంగా మారింది. అయితే ఇది బీజేపీ నేతల్ని తీవ్ర ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. 40 సీట్లు ఉన్న షిండే వర్గానికి సీఎం పదవితో పాటు ఎనిమిది మందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇక కేవలం 30 స్థానాలే ఉన్న అజిత్ పవార్ వర్గానికి డిప్యూటీ సీఎంతో పాటు ఎనిమిది మంత్రి పదవులు ఇచ్చారు. కానీ 105 స్థానాలున్న బీజేపీకి కూడా ఒక ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంది మంత్రులే ఉన్నారు. అయితే అజిత్ వర్గానికి కీలక శాఖలు ఇవ్వడంపై శివసేన వర్గంలోనూ అసంతృప్తి కనిపిస్తుంది.
Read Also: BabyTheMovie: ఇందూకు చెల్లి దొరికిందిరోయ్.. అలా అయితే పాప పరిస్థితి కష్టమేరోయ్
ఎన్సీపీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అజిత్ పవార్ జూలై 2న తన మద్దతుదారులతో కలిసి మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరారు. తనకు 40మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉందని, తమదే అసలైన ఎన్సీపీ అని ఆయన తెలిపారు. ఎన్సీపీ తరఫునే తాము ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటించామన్నారు. అజిత్ పవార్ తో పాటు ఆయన తరఫున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, అప్పట్నించీ శాఖల కేటాయింపు జరుగలేదు.. ఇవాళ( శుక్రవారం ) కేటాయించిన శాఖల్లో కీలకమైన శాఖలను అజిత్ వర్గానికి దక్కాయి.