చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల స్క్వాష్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. 2018 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన స్క్వాష్ జట్టు.. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మలేషియా జట్టును 2-0తో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
ఆసియా కప్ 2023 ఫైనల్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించినందుకు పలువురు క్రికెట్ దిగ్గజాలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ నుంచి యువరాజ్ సింగ్ వరకు పలువురు క్రికెటర్లు అభినందనలు తెలిపారు.
2023 ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా శ్రీలంకను సులువుగా ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ 8వ సారి ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు కేవలం 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది.
ఆసియా కప్ 2023లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బంతితో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ తన రెండో ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టడంతో వన్డే క్రికెట్‌లో 50 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు.
రేపు శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో తలపడనుంది. శ్రీలంక కంటే భారత్ జట్టు చాలా బలంగా ఉన్న.. లంకేయుల జట్టులో ఓ ఆటగాడు టీమిండియాను టెన్షన్‌కి గురిచేస్తున్నాడు. ఇంతకుముందు జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడి�
ఫైనల్స్లో భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. దీంతో ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. IBSA వరల్డ్ గేమ్స్‌లో అంధుల క్రికెట్ గత వారమే అరంగేట్రం చేయగా.. ఫైనల్స్ బెర్త్ ఖరారు చేసుకున్న తొలి జట్టుగా భారత్ రిక�
ఇవాళ జరుగుతున్న ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్-ఏ.. భారత-ఏ జట్టు ముందు బిగ్ టార్గెట్ ను ఉంచింది. కొలొంబో వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండగా.. టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. తయ్యబ్ తాహిర్ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.
ఐపీఎల్ 16వ సీజన్ లో ఇవాళ రెండో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఘన విజయంతో ముంబై ఇండియన్స్ దూకుడు మీదుంటే.. లీగ్‌లో తొలిసారి గుజరాత్ టైటాన్స్ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది.