మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది! యాక్టర్ల పారితోషికాలు మామూలుగా లేవు. ఏకంగా సినిమా బడ్జెట్‌లో 60 శాతం రెమ్యునరేషన్స్ అందజేస్తున్నారు. ఇండస్ట్రీపరంగా నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికాలు భారీగా పెరిగాయి. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న యాక్టర్లు, డైరెక్టర్లు కూడా ఎక్కువ రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా రెండు నెలలకు పైగా షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోయాయి. కాగా వేవ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇటీవలే ముంబయిలో షూటింగ్ లకు అనుమతినిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనూ షూటింగ్స్ కి అనుమతి వున్నా అప్పుడే సాహసం చేయటం లేదు. కాగా ఈ నెల చివర్లో షూటింగ్స్ పునప్రారంభం కానుండగా.. జులై మొదటివారంలో అన్ని సినిమాల షూటింగ్స్ మొదలు కానున్నాయి. విదేశాల్లో ప్లాన్ చేసిన షూటింగ్స్ సైతం కరోనా ప్రభావంతో హైదరాబాద్ లోనే సెట్స్…
కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం క్షీణిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈమేరకు శనివారం ఓ ప్రకటన జారీ చేసింది. దీంతో సోమవారం నుంచి అక్కడ 50శాతం సామర్థ్యంతో సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. ప్రేక్షకుల సీట్ల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. థియేటర్, మల్టీప్లెక్స్ ఆవరణలో సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ప్రేక్షకులు థియేటర్లలోకి ప్రవేశించగానే ముందుగా థర్మల్ స్క్రీన్…