పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని ఎల్.బి. స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు, సినీ రంగానికి చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. సంగీత…
Maruthi: ఈ మధ్య కాలంలో త్రిబాణదారి బార్బరిక్ అనే సినిమా ప్రేక్షకులకు నచ్చలేదని చెప్పి, ఆ సినిమా దర్శకుడు చెప్పుతో కొట్టుకుని సంచలనానికి కేంద్ర బిందువుగా మారాడు. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అతను మాట్లాడుతూ, సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటానన్నాడు. ప్రేక్షకులు పెద్దగా సినిమా మీద ఆసక్తి కనబరచకపోవడంతో, నిజంగానే చెప్పుతో కొట్టుకొని హాట్ టాపిక్ అయ్యాడు. నిజానికి ఈ సినిమాని ప్రజెంట్ చేసింది దర్శకుడు మారుతి. మారుతి టీం ప్రోడక్ట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల…
వెంకీ అట్లూరి చివరిగా ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే తెలుగులో ఐదు సినిమాలు పూర్తి చేసిన ఆయన, తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంలో తన కెరీర్ మరియు సినీ జర్నీ గురించి పలు విషయాలు పంచుకున్నారు. అయితే, వెంకీ అట్లూరి విషయంలో ‘సార్’ సినిమా చేసినప్పుడు లేదా ‘లక్కీ భాస్కర్’ సినిమా చేసినప్పుడు, “తెలుగు హీరోలు ఎవరూ దొరకలేదా? తమిళ హీరోలను తీసుకొచ్చి సినిమాలు…
Vijay Antony : విజయ్ ఆంటోనీ హీరోగా తన డైరెక్షన్ లోనే వచ్చిన బిచ్చగాడు ఓ సెన్సేషన్. దానికి సీక్వెల్ గా ఇప్పటికే సెకండ్ పార్ట్ వచ్చింది. మూడో పార్టు ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా దానిపై హీరో విజయ్ ఆంటోనీ క్లారిటీ ఇచ్చారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ మార్గన్. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్తున్నాను అనే ప్రచారాన్ని…
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా హత్యాచార ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంకోవైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కదులుతున్న కారులో మోడల్‌పై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. సోషల్ మీడియాలో కనెక్ట్ అయిన వ్యక్తి.. సినిమా దర్శకుడిని పరిచయం చేస్తానని నమ్మించి ఆగస్టు 28న లక్నోకు పిలిచి అత్యాచారానికి తెగబడ్డాడు. ఇలా కారు, హోటల్‌లో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి…
Weird Director: సినిమా డైరెక్టర్ కావాలని అనుకున్నాడు. కానీ ఎలా? దేనికైనా సరే పైసలు అవసరం. అయితే డబ్బులు కావాలంటే కష్టపడాలి అలా చేయడానికి బద్దకం. అందుకే ఓ ప్లాన్ వేశాడు ప్రబుద్ధుడు. దొంగతనం చేసి సినిమా డైరెక్టర్ కావాలని అనుకున్నాడు. అంతేకాదు దొంగతం చేయడానికి ఓ టైం కూడా సెట్ చేసుకున్నాడు. ఆ సమయం తగ్గట్టుగానే దొంగతనాలు చేస్తూ షార్ట్ ఫిలిమ్ లో కూడా నటించాడు. అంతటితో ఆశ ఆగలేదు సినిమా డైరెక్టర్ కావాని అనుకున్నాడు.…
“నవ్వు నారాయణుడు ఇచ్చిన వరం” అన్నారు పెద్దలు. ఆ మాటనే పట్టుకొని సాగారు ఇ.వి.వి. సత్యనారాయణ. నవ్వడంలోని యోగాన్ని, నవ్వించడంలోని భోగాన్నీ గురువు జంధ్యాల దగ్గర ఒడిసిపట్టి, ఆపై కితకితలు పెట్టి ‘జంబలకిడిపంబ’ పలికించారు ఇ.వి.వి. ఆయన పూయించిన నవ్వుల పువ్వుల గుబాళింపు ఈ నాటికీ ఆనందం పంచుతోంది. ఆహ్లాదం పెంచుతోంది. ఇ.వి.వి. సత్యనారాయణ 1956 జూన్ 10న పశ్చిమ గోదావరి జిల్లా కోరుమామిడి గ్రామంలో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ సినిమాలు చూస్తూ, వాటిలోని తప్పొప్పులను…
విలువలను వీడకుండా ఓ సంకల్పంతో సినిమాలు తెరకెక్కించినవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో కొల్లిపర బాలగంగాధర తిలక్ ఒకరు. ఇలా అంటే ఎవరికీ తెలియదు కానీ, కె.బి.తిలక్ అనగానే సినీ అభిమానులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఓ వైవిధ్యం చూపించాలని తపించేవారు తిలక్. ఆ తపనే ఆయనను ప్రత్యేకంగా నిలిపింది. కె.బి.తిలక్ 1926 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జన్మించారు. ప్రఖ్యాత దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ స్వయాన అక్క కుమారుడే…
(ఆగస్టు 18న గుల్జార్ పుట్టినరోజు) సంస్కృత ప్రభావం నుండి తెలుగు భాష తప్పించుకోలేనట్టే, ఉర్దూ పదాలు లేకుండా హిందీ శోభించదు. ఈ విషయం తెలిసిన వారు ఉర్దూను అందంగా, హిందీ సాహిత్యంలో చొప్పించేవారు. అలా ఎందరో హిందీ చిత్ర గీతరచయితలు సాగారు. వారిలో గుల్జార్ బాణీ ప్రత్యేకమైనది. కేవలం పాటలతోనే కాదు, మాటలతోనూ మురిపించిన ఘనుడు గుల్జార్. కథకునిగానూ కట్టపడేశారు. దర్శకత్వంతోనూ మురిపించారు. అంతలా అలరించిన గుల్జార్ అసలు పేరు సంపూరణ్ సింగ్ కల్రా. గుల్జార్ అన్నది…
చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి పొంతనలేని జీవితాలు ఉంటాయి. ముఖ్యంగా కళారంగంలో అలాంటి జీవులు కనిపిస్తూఉంటారు. చిత్రసీమలో అలా సాగుతున్నవారెందరో! అలాంటి వారిలో యువ దర్శకుడు సంపత్ నంది తానూ ఉన్నానని చాటుకున్నాడు. అతను చదివిందేమో బి.ఫార్మసీ, చిత్రసీమలో అడుగు పెట్టి రచయితగా, యాడ్ ఫిలిమ్ మేకర్ గా, దర్శకునిగా, నిర్మాతగా సాగుతున్నాడు. పట్టుమని నాలుగంటే నాలుగే చిత్రాలకు దర్శకత్వం వహించిన సంపత్ నంది, ఐదో చిత్రంగా ‘సీటీమార్’ రూపొందింది. గత సంవత్సరమే జనం ముందుకు రావలసిన…