Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్‌లు.. నెట్టింట తీవ్ర వివాదం
- నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్‌లు
- సోషల్ మీడియాలో తీవ్ర వివాదం
- వ్యతిరేక, అనుకూల వ్యాఖ్యలతో రచ్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనువుగాని చోట అధికులమనరాదు అని పెద్దలు అంటారు. ఈ మాట అక్షర సత్యమే. అన్ని చోట్ల హంగామా సృష్టిద్దాం అంటే కుదరదు. లేదంటే లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవాల్సి వస్తుంది. తాజాగా కెనడాలోని టొరంటో నగరంలో భారతీయులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తీవ్ర వివాదంగా మారింది. వలసలపై రచ్చ రచ్చ అవుతోంది. అసలేం జరిగింది. ఎందుకు వివాదం చెలరేగిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
కెనడాలోని టొరంటో నగర వీధుల్లో భారతీయలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వందలాది మంది భారతీయులు సంప్రదాయ సంగీతం, నృత్యాలు చేశారు. ఆడామగా తేడా లేకుండా డ్యాన్స్‌లు చేశారు. ఇక ఆహార స్టాళ్ల దగ్గరైతే సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ వేడుక కంటే.. దీనిపై రచ్చే పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
వివాదాస్పద వ్యాఖ్య
ఒక వినియోగదారుడు ‘‘కెనడా ఇప్పుడు భారతీయుల కాలనీగా మారిపోయింది. ఇది జరగనివ్వకూడదు.’’ అనే వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. దీంతో పోస్టు క్షణాల్లోనే వైరల్ అయింది. వేలాది మంది అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలు చేస్తూ పెద్ద ఎత్తున చర్చ మొదలుపెట్టారు. కొంతమంది నెటిజన్లు కెనడాలో పెరుగుతున్న భారతీయ వలసలపై ఆందోళన వ్యక్తం చేశారు. స్వదేశ సంస్కృతిని విదేశాల్లోనూ కొనసాగించడం కంటే స్థానిక సంస్కృతిలో కలిసిపోవాలని వలసదారులు ప్రయత్నించాలని అభిప్రాయపడ్డారు. కొందరైతే మరింత ముందుకు వెళ్లి ఇలాంటి భారీ సాంస్కృతిక వేడుకలను అధికారులు పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ఇలా సోషల్ మీడియా వేదికగా తీవ్ర వివాదంగా మారింది.
మరోవైపు మద్దతు
మరోవైపు భారీ సంఖ్యలో నెటిజన్లు భారతీయ వలసదారులకు మద్దతుగా నిలిచారు. కెనడా అభివృద్ధిలో వలసదారుల పాత్ర కీలకమని.. వారు అధిక పన్నులు చెల్లించడంతో పాటు కార్మిక లోటును భర్తీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక సాంస్కృతిక వేడుకను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరైంది కాదని.. ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్న కార్యక్రమంలో తప్పేముందని ప్రశ్నించారు. భారతీయులకు మద్దతుగా మాట్లాడారు.
బహుళ సంస్కృతుల దేశంగా కెనడా
కెనడా బహుళ సంస్కృతుల సమాజంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. వివిధ దేశాల ప్రజలు తమ సంప్రదాయాలను, సంస్కృతులను పరిరక్షించుకునే స్వేచ్ఛ అక్కడ ఉంది. అయితే ఇటీవలి కాలంలో ఆర్థిక ఒత్తిళ్లు, జనాభా మార్పులు, వలసల పెరుగుదల వంటి అంశాలు కొన్ని వర్గాల్లో అసంతృప్తికి దారితీస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. టొరంటోలో జరిగిన ఈ ఘటన కేవలం ఒక వైరల్ వీడియోకే పరిమితం కాకుండా.. ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన దేశాల్లో వలసలు, సమీకరణ, బహుళ సంస్కృతుల విధానాలపై కొనసాగుతున్న చర్చలకు ప్రతిబింబంగా మారింది. భారతీయ వలసదారులపై పెరుగుతున్న విమర్శలు, మరోవైపు వారికి లభిస్తున్న మద్దతు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి.
Canada has turned into an Indian colony!!!!
Canadians are now a minority in Toronto and the flood of immigrants is larger than ever before.
We cannot let this happen to us. Wake up!!!! pic.twitter.com/TIxnzuLeS7
— Știrile Rezistenței 🇷🇴 🇷🇺 (@RomaniaMare1918) June 2, 2026
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!