చిరంజీవి.. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా, సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి ఆయన చేసిన సేవలు అంతా ఇంతా కాదు. ఎంతో మంది హీరోలకు ఆయన స్ఫూర్తి గా కూడా నిలిచారు. అలా 2024లో భారత ప్రభుత్వం నుంచి, రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను అందుకున్నా చిరంజీవి.. గత ఏడాది అత్యంత సమర్ధవంతమైన నటుడు, డ్యాన్సర్‌గా గిన్నిస్…