India-Pakistan War: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దాయాది దేశానికి చెందిన కళాకారులు, ప్రముఖులకు సంబంధించిన యూట్యూబ్, సోషల్ మీడియా అకౌంట్లను భారతదేశం బ్లాక్ చేస్తుంది. ఈ సందర్భంగా పాక్ నటుడు ఫవాద్ ఖాన్, గాయకుడు అతిఫ్ అస్లాంల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను నిలిపివేయబడింది.
Abir Gulaal: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులు చనిపోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ అయిన లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. మంగళవారం, పహల్గామ్‌లోని బైసరీన్ పచ్చిన మైదానాలు చూస్తున్న టూరిస్టులపై ముష్కరులు దాడి చేశారు.
పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇలా మన దేశ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారని సోషల్ మీడియాలో…