రాష్ర్టంలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. నెలరోజుల కిందట కోసిన పంట కూడా ఇప్పటికి తూకానికి రాని పరిస్థితి. రాష్ర్టంలో చాలా జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. కల్లాలు, రోడ్ల మీద కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన పంటను కొనేవారు లేక రైతులు దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పలు జిల్లాలో ధాన్యం తడిసిపోయింది. నల్లగొండ, నిజామాబాద్ వంటి జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం మొలకలు వచ్చింది. రాష్ర్టంలో ఆలస్యంగా కోతలు…
ఖరీఫ్ పంట రోడ్డు మీద ఉంటే పంట కొనే ధ్యాస ఈ ప్రభుత్వానికి లేదని నారాయణపేట కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తు వ్యాఖ్యలు చేశారు. మా పంట కొనండి అని రైతులు ఎంత మొత్తుకున్నా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానపడ్డట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ బీజేపీలు రెండు కుమ్మకై నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్రం ఖరీఫ్‌లో పండించింది మేము తీసుకుంటామని చెప్పిన, మనం పండించిన పంటను ఎందుకు కొనరో…
సీఎం కేసీఆర్‌కు రైతుల సమస్యలపై చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. టీఆర్‌ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. వరి కల్లాల్లో ధాన్యం ఉన్న కొనకుండా కేసీఆర్ సర్కార్ ఏం చేస్తుందంటూ ఫైర్ అయ్యారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌కు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అన్నారు. కేసీఆర్.. ప్రధాని మోడీ ఇంటి ముందు ఎందుకు ధర్నా చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం, టీఆర్‌ఎస్ డ్రామాలు ఆడుతూ రైతులను…
రైతులు ఉద్యమానికి ఏడాది పూర్తి కానున్న సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మహా ధర్నాకు ముఖ్య అతిథిగా కిసాన్ సంయుక్త మోర్చా నాయకుడు రాకేష్ టికాయత్‌తో పాటు ఉత్తారాది రైతు సంఘాల నేతలు ఈ మహాధర్నాకు హాజరయ్యారు.ఈ సందర్భంగా టికాయత్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. భాష వేరు కావొచ్చు రైతులందరి లక్ష్యం ఒక్కటేనన్నారు. రైతుల సంఘాలు అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదన్నారు. కేంద్రాన్ని…
అన్నదాత కడుపు మండుతోంది. నారు పోసి, ఆరుగాలం కష్టాలు పడి పంట పండిస్తే కొనేవారు లేక రైతులు ఆగ్రహానికి గురవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. సొసైటీ కి తాళం వేసి నిరసన తెలిపారు. ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి తాళం వేసి నిరసన తెలిపారు రైతులు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు నెమ్మదిగా కొనసాగుతోందని ఆరోపించారు. అకాల వర్షాలతో రోజు రోజుకి…
రైతుల ఉసురు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తగులుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతులపై కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సీజన్లో ధాన్యం ఎంతయినా కొనాలని కేంద్రం స్పష్టంగా చెప్పిందని, అయినా కేసీఆర్ వచ్చే సీజన్‌కు ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు ముందు చూపు లేకపోవడం వల్లనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తక్కువ ధరకు వడ్లు అమ్ముకొవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రైతులతో పెట్టుకున్న వారు ఎవ్వరూ ముందుకు పోలేదని కేసీఆర్…
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని… రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ తీసుకున్న.. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని… ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే చేయాలన్నది వారి డిమాండ్. అయితే.. రైతుల ఉద్యమానికి… ప్రతి పక్షాలు అన్ని ఇప్పటికే మద్దతు తెలిపాయి. ఇక తాజాగా జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 26వ తేదీన రాజధాని రైతుల పాదయాత్రలో జనసేన ముఖ్య నేతలు పాల్గొననున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటన చేసింది.…
రాష్ర్టంలో గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు, యాసంగి వరి పంటపైన తీవ్ర చర్చ జరుగుతుంది. అసలు వరిపంట కొనుగోలుపై ఎప్పుడు రానీ కష్టం.. ఇప్పుడేందుకు వచ్చింది. ఈ విషయం పై ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాన్ని విమర్శిస్తుంటే, అధికార టీఆర్ఎస్ మాత్రం నెపాన్ని కేంద్రం మీద తోస్తుంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. దీనిపై రాజకీయాలు ఎలా ఉన్న చివరికి నష్ట పోయేది మాత్రం సగటు రైతన్నలే.. కేంద్రం దీనిపై ఏం చెబుతుంది…
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని… గత శుక్రవారం పీఎం నరేంద్ర మోడీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే… ఈ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకునే ప్రక్రియకు తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోద ముంద్ర వేసింది. వివాదాస్పద 3 వ్యవసాయ చట్టాలను వెనక్కుతీసుకునే ప్రక్రియను పూర్తిచేసిన కేంద్రం… రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉపసంహరణకు సర్వం సిద్ధమైంది. అలాగే…. మరో 4 నెలల పాటు ఉచిత…
దేశంలో ఎరువుల కొరత అసలే లేదని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. యూరియా లాంటి ఎరువులు పరిశ్రమలకు తరలకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిం చాలని ఆయన సూచించారు. అలాగే ఎరువులు సహా ఇతర పోషకాల గిరాకీ-సరఫరాపై రోజువారీ పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. నేడు వివిధ రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రులతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ కీలక సూచనలు చేశారు. కృత్రిమ ఎరువులతో పాటు ఆర్గానిక్ వంటి ప్రత్యామ్నాయాలపైనా దృష్టి సారించాలని…