Rahul Gandhi: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) చట్టం, ఇతర డిమాండ్లలో 200 రైతు సంఘాలు ఢిల్లీ ఛలో మార్చ్‌కి పిలుపునిచ్చాయి. దీంతో ఢిల్లీ-హర్యానా సరిహద్దులు ఉద్రిక్తంగా మారాయి. ట్రాక్టర్లతో వచ్చిన రైతుల్ని పోలీసులు, కేంద్రబలాగాలు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతుల్ని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. మరోవైపు ఎలాగైనా ఢిల్లీ వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి రుణమాఫీ చేయాలని, రైతులకు, రైతు కూలీలకు పింఛన్ల పథకాన్ని తీసుకురావాలని, లఖీంపూర్ ఖేరీ బాధితులకు ఆర్థిక సాయం అందించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Read Also: Haldwani violence: హల్ద్వానీ హింస..300 ముస్లిం కుటుంబాలు పరారీ.. అధికారుల వేట తీవ్రతరం..
ఇదిలా ఉంటే, రైతుల ఆందోళనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. భారత్ జోడో న్యాయ యాత్రలో ఉన్న ఆయన.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమీషన్ ప్రకారం పంటకలు మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై చట్టం చేస్తామని మంగళవారం హామీ ఇచ్చారు. ఈ ప్రకటన చారిత్రాత్మకమని, 15 కోట్ల మంది రైతు కుటుంబాలకు భరోసా కల్పించడం ద్వారా వారి జీవితాలను మారుస్తామని రాహుల్ గాంధీ అన్నారు. న్యాయమార్గంలో కాంగ్రెస్ మొదటి హామీ ఇదే అని ఆయన అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ జిల్లాలో జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా ఇలాంటి హామీలు ఇచ్చారు.
किसान भाइयों आज ऐतिहासिक दिन है!
कांग्रेस ने हर किसान को फसल पर स्वामीनाथन कमीशन के अनुसार MSP की कानूनी गारंटी देने का फैसला लिया है।
यह कदम 15 करोड़ किसान परिवारों की समृद्धि सुनिश्चित कर उनका जीवन बदल देगा।
न्याय के पथ पर यह कांग्रेस की पहली गारंटी है।#KisaanNYAYGuarantee
— Rahul Gandhi (@RahulGandhi) February 13, 2024